Kanguva – Sizzle Teaser : కంగువా టీజర్ రివ్యూ: గూస్ బంప్స్ రేపుతున్న విజువల్స్, సూర్య నయా అవతార్!

ఇద్దరు బలమైన వీరులు తలపెడితే ఆ యుద్ధం ఎలా ఉంటుంది అనేలా వారి పాత్రలు దర్శకుడు తీర్చిదిద్దాడని అర్థం అవుతుంది. సినిమాటోగ్రఫీ హైలెట్ గా ఉంది. ఇక చరిత్రకు వర్తమానానికి సంబంధం ఏమిటీ? సైంటిస్ట్ దేవా-కంగువా మధ్య ఉన్న సంబంధం ఏమిటీ? అనేది కథలు అసలు ట్విస్ట్. దేవిశ్రీ ప్రసాద్ బీజీఎమ్ పర్లేదు అని చెప్పాలి.

Written By: NARESH, Updated On : March 19, 2024 7:06 pm

Kanguva - Sizzle Teaser

Follow us on

Kanguva – Sizzle Teaser  : విలక్షణమైన సబ్జక్ట్స్ ఎంచుకోవడంలో ముందు ఉంటాడు హీరో సూర్య. ఆయన చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలు కూడా ఇచ్చాయి. ఈసారి ఆయన కంగువా అంటూ ప్రేక్షకులను పలకరించనున్నాడు. కంగువా చిత్రానికి శివ దర్శకుడు. మాస్ చిత్రాల దర్శకుడిగా పేరున్న శివ ఈసారి భిన్నమైన సబ్జెక్టు ట్రై చేస్తున్నారు. రెండు కాలాల్లో సాగే కథగా కంగువా తెరకెక్కుతుంది. కంగువా మూవీలో సూర్య డ్యూయల్ రోల్ చేయడం విశేషం. పీరియాడిక్ రోల్ తో పాటు సమకాలీన సైంటిస్ట్ గా ఆయన నటిస్తున్నారు.

నేడు కంగువా టీజర్ విడుదల చేశారు. దాదాపు నిమిషం నిడివి కలిగిన కంగువా టీజర్ సూర్య ఫ్యాన్స్ కి పండగ అని చెప్పాలి. సూర్య లుక్, క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంది. హాలీవుడ్ చిత్రాలను తలపించేలా విజువల్స్ ఉన్నాయి. పురాతన కాలంలో తెగల మధ్య ఆధిపత్య పోరు, యుద్ధాలను నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఓ తెగ నాయకుడే కంగువా. అతడి ప్రత్యర్థిగా యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ నటిస్తున్నాడు. సూర్య, బాబీ డియోల్ లుక్స్ భయంకరంగా ఉన్నాయి.

ఇద్దరు బలమైన వీరులు తలపెడితే ఆ యుద్ధం ఎలా ఉంటుంది అనేలా వారి పాత్రలు దర్శకుడు తీర్చిదిద్దాడని అర్థం అవుతుంది. సినిమాటోగ్రఫీ హైలెట్ గా ఉంది. ఇక చరిత్రకు వర్తమానానికి సంబంధం ఏమిటీ? సైంటిస్ట్ దేవా-కంగువా మధ్య ఉన్న సంబంధం ఏమిటీ? అనేది కథలు అసలు ట్విస్ట్. దేవిశ్రీ ప్రసాద్ బీజీఎమ్ పర్లేదు అని చెప్పాలి. మొత్తంగా కంగువా టీజర్ అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్లింది. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల కానుంది.

కంగువా చిత్రంలో సూర్యకు జంటగా దిశా పటాని నటిస్తుంది. జగపతిబాబు ఓ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం. కేఈ జ్ఞానవేల్ రాజా, ప్రమోద్, వంశీ కృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు. కంగువా అనంతరం సూర్య సుధా కొంగర దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. వీరి కాంబోలో వచ్చిన సూరారై పోట్రు మంచి విజయం సాధించింది. సూర్య జాతీయ అవార్డు అందుకున్నారు.