Rajinikanth : కొన్ని ఫొటోలు, కొన్ని వీడియోలను డైజెస్ట్ చేసుకోలేం. రజినీకాంత్ అభిమానులు అయితే అస్సలు సహించరు. ఎందుకంటే రజినీకాంత్ అంటే వాళ్లకు దేవుడు. పైగా 72 ఏళ్లు. ఆయన వయసుకు ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖులు రజినీకాంత్ కాళ్లు మొక్కుతారు.
అయితే దైవభక్తి నిండుగా ఉన్న రజినీకాంత్ మాత్రం ఇప్పటికీ యోగిలు, గురువులు, బాబాలను దైవాంస సంభూతులుగా భావిస్తాడు. వారికి అత్యంత గౌరవం ఇస్తాడు.
ఈ క్రమంలోనే ఈ మధ్యనే హిమాలయాలకు టూర్ కు వెళ్లిన రజినీకాంత్ తన కొత్త సినిమా జైలర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అటు నుంచి అటే యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ ను కలవడానికి వెళ్లాడు. లక్నోకు వెళ్లిన 72 ఏళ్ల రజినీకాంత్ తనకంటే చాలా చిన్నవాడైన యూపీ సీఎం యోగి కాళ్లను మొక్కారు. యోగి ఇంటి బయట వేచి ఉన్న ఆయన పాదాలకు నమస్కరించారు.
అయితే యోగి ఒక సన్యాసి, ఆధ్యాత్మిక గురువు కావడంతోనే అలా రజినీ చేసి ఉండొచ్చు. ఆధ్యాత్మిక భావాలు ఉన్న రజినీ యోగిని ఆ కోణంలోనే చూసే ఆశీర్వాదం తీసుకొని ఉండొచ్చు. అంత పెద్ద స్టార్ కాళ్ల మీదపడ్డా యోగి వారించి ఉండాల్సింది. ఆయన అలా చేయలేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. చాలా మంది ఈ చర్యను తప్పుపట్టగా.. కొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు.