Roja – Sunnyleone : సన్నీలియోన్ వివాదం: లెంపలేసుకొని మంత్రి రోజాకు సారీ చెప్పిన అగ్రపత్రిక

మంత్రి రోజాను టార్గెట్ చేసి దక్కన్ క్రానికల్ పత్రిక వేసిన కథనం అభాసుపాలైంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ను కామెంట్ చేస్తూ మధ్యలో సన్నీలియోన్ ను తీసుకు వచ్చింది రోజా. రోజా కామెంట్స్ వైరల్ అయ్యాయి. జగన్ మీద వారి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ చాలా వ్యాఖ్యలు చేసారు.

Written By: NARESH, Updated On : July 17, 2023 4:12 pm
Follow us on

Roja – Sunnyleone : ఆంగ్ల దినపత్రిక తన తప్పు తెలుసుకొని లెంపలేసుకుంది. రోజాకు బహిరంగంగా పత్రికాముఖంగా సారీ చెప్పింది. సోషల్ మీడియాను నమ్ముకొని గుడ్డిగా చెక్ చేయకుండా వార్త వేసినందుకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తోంది. ఏపీ మంత్రి రోజాకు పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పే దుస్థితికి దక్కన్ క్రానికల్ దిగజారింది.

తాజాగా మంత్రి రోజాను టార్గెట్ చేసి దక్కన్ క్రానికల్ పత్రిక వేసిన కథనం అభాసుపాలైంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ను కామెంట్ చేస్తూ మధ్యలో సన్నీలియోన్ ను తీసుకు వచ్చింది రోజా. రోజా కామెంట్స్ వైరల్ అయ్యాయి. జగన్ మీద వారి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ చాలా వ్యాఖ్యలు చేసారు.‘వైఎస్ భారతమ్మ నువ్వు నీ భర్తకు సంస్కారం నేర్పించమ్మ లేదంటే నేను నేర్పిస్తాను’ అంటూ జగన్ పై పవన్ కామెంట్స్ చేసాడు. దీనిపై రోజా మాట్లాడుతూ.. ”పవన్ కళ్యాణ్ వచ్చి జగన్ కు సంస్కారం నేర్పిస్తాడంట.. ఇది ఎలా ఉందంటే సన్నీలియోన్ వచ్చి వేదాలు పలికినట్టు ఉంటుంది” అంటూ కామెంట్స్ చేసింది..

ఈ వ్యాఖ్యలపై నిజానికి సన్నీలియోన్ స్పందించలేదు. ఆమె పేరుతో ట్విట్టర్ లో ఫేక్ అకౌంట్ సృష్టించి ఆమె ద్వారా ఒక పోస్ట్ చేశారు. అచ్చం సన్నీలియోన్ స్పందించినట్టు పచ్చ మీడియా సృష్టించి రోజాపై అవాస్తవ కథనంతో బ్యానర్ గా వేశారు. ‘నేను ఒక పోర్న్ స్టార్ ను కానీ నా గతం గురించి నేను ఎప్పుడు పశ్చాత్తాప పడలేదు.. నేను చేయాలనుకున్నది బహిరంగంగానే చేస్తాను.. కానీ మీలా చేయలేదు.. మీకు నాకు ఉన్న తేడా ఏంటంటే నేని ఇండస్ట్రీని వదిలేసాను.. మీరు వదిలేయలేదు..’ అంటూ సన్నీలియోన్ పేరుతో చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. తెగ షేర్ చేస్తూ రోజాకు కౌంటర్లు ఇచ్చారు. దీన్నే నిజం అనుకొని ఎలాంటి చెక్ చేసుకుండా పచ్చ మీడియాతోపాటు దక్కన్ క్రానికల్ కూడా అలానే ప్రచురించింది.

అయితే రోజాపై సన్నీలియోన్ అధికారికంగా స్పందించలేదని.. అది ఫేక్ అకౌంట్ అని తేలడంతో దెబ్బకు పచ్చమీడియా ఖంగుతిన్నది. దక్కన్ క్రానికల్ పత్రిక రోజాపై వేసిన కథనానికి చింతిస్తూ వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పింది. రోజాపై కామెంట్ చేసిన ఇతర మీడియా వర్గాలు మాత్రం స్పందించలేదు. ఇలా చెక్ చేసుకోకుండా వేస్తే ఎలా డ్యామేజ్ అవుతారన్న దానికి దక్కన్ క్రానికల్ పత్రిక చేసిన పొరపాటు ఉదాహరణగా చెప్పొచ్చు.