AP Politics : జగన్ పరువు తీయడానికి ఈ ‘ఒక్క ఫొటో’ చాలు..

అయితే ఎంత గొంతు చించుకున్నా మనం చెప్పాల్సిన విషయం సూటిగా అందరికీ చేరువ కాదు. అలా చేరువ చేయాలంటే చిత్రమే ముఖ్యం. అప్పట్లో ఈనాడులో శ్రీధర్ వేసే కార్టూన్లు రాజకీయ నేతల బట్టలిప్పి బరివాత నిలబెట్టేవి. ఎంతో అద్భుతమైన కార్టూన్లతో శ్రీధర్ నిజంగానే ప్రజల మనసు దోచాడు. చిత్రాలకు అంత పవర్ ఉంటుందని నిరూపించాడు.

Written By: NARESH, Updated On : July 26, 2023 8:37 pm
Follow us on

AP Politics : ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక అంటారు.. కానీ ఒక్క చిత్రం ఎంతో మందికి చెంప పెట్టులాంటి సమాధానం అని నేను అంటున్నాను. నేనే కాదు.. చాలా మంది చిత్రకారులు అదే అంటారు. ఈ ఉపాధ్ఘాతం పక్కనపెడితే.. ఒక పెద్ద వ్యాసంలో .. ఒక స్టోరీలో చెప్పలేని దాన్ని కేవలం ఒక్క ఫొటోతో చెప్పొచ్చు. ఎలా అంటారా? ఇటీవల మణిపూర్ అల్లర్లపై ఒక జాతీయ పత్రిక ‘ముసలి కన్నీరు’ ఫొటోను పత్రిక బ్యానర్ గా పెట్టి మోడీ సర్కార్ చెంప చెల్లుమనిపించింది. అంతటి దమ్ము ధైర్యం చూపించింది.

అక్కడే కాదు.. ఇక్కడ కూడా అలాంటి తెలివితేటలు కొన్ని మీడియా సంస్థలకు ఉన్నాయి. కానీ వాటికి బోలెడన్నీ అలిగేషన్స్. ఈనాడు, జ్యోతి చంద్రబాబు మీద ఈగవాలనివ్వవు.. సాక్షి జగన్ పై కాపు కాస్తుంది. వాళ్ల విమర్శలు, పొగడ్తలతోనే వారి దుకాణం పూర్తవుతుంది. ఇక క్రియేటివిటీ వార్తలు రావడం కష్టమే.

అయితే ఎంత గొంతు చించుకున్నా మనం చెప్పాల్సిన విషయం సూటిగా అందరికీ చేరువ కాదు. అలా చేరువ చేయాలంటే చిత్రమే ముఖ్యం. అప్పట్లో ఈనాడులో శ్రీధర్ వేసే కార్టూన్లు రాజకీయ నేతల బట్టలిప్పి బరివాత నిలబెట్టేవి. ఎంతో అద్భుతమైన కార్టూన్లతో శ్రీధర్ నిజంగానే ప్రజల మనసు దోచాడు. చిత్రాలకు అంత పవర్ ఉంటుందని నిరూపించాడు.

ఇప్పుడు జగన్ పరిపాలనను ఈ ఒక్క ఫొటోతో పరువు తీసేలా చేశారు మచిలీపట్నం జనాలు. జగన్ ఎంతో ఆర్భాటంగా పేదల కోసం జగనన్న కాలనీలు నిర్మిస్తున్నారు. కానీ అవి నివాస యోగ్యం కాదని ఎన్నో ఆరోపణలు. ఎంత గొంతుచించుకున్నా ఎవరూ వినలేదు. కానీ ఇప్పుడు వర్షాలతో జగనన్న కాలనీల గుట్టురట్టు అవుతోంది.

ఏపీలోనే అతిపెద్ద లేఅవుట్ గా వైసీపీ నేతలు చెబుతున్న కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కరగ్రహారం పరిధిలో 360 ఎకరాల జగనన్న లేఅవుట్ వేశారు. అయితే రెండు రోజుల వర్షానికే అది చెరువును తలపిస్తోంది.  టీడీపీ కార్పొరేటర్ లతో కలిసి మున్సిపల్ మాజీ చైర్మన్ బాబా ప్రసాద్ లేఅవుట్ ను పరిశీలించి చెరువుగా మారిన దాంట్లో ఈత కొట్టి నిరసన తెలిపారు. ఈ ఒక్క ఫొటో చాలు జగన్ పరువు తీయడానికి అని ఆడిపోసుకున్నారు. అందులో ఈత కొడుతూ.. నడుంలోతులో వెతుకుతూ నిరసన తెలిపారు. ఇళ్ల స్థలాల పేరుతో జగన్ సర్కార్ ప్రజల జీవితాలతో ఆటలాడుతోందని ఆడిపోసుకున్నారు. దీన్ని బట్టి జగన్ చెరువులు, కుంటలు లాంటి ప్రభుత్వ స్థలాలను.. ప్రజలకు ఉపయోగం లేనివాటినే కాలనీలుగా మారుస్తున్నాడన్న అన్న సందేహాలు రాకమానవు.