https://oktelugu.com/

Nandyal: జీవిత ఖైదీగా ఉంటూ.. పీజీలో గోల్డ్ మెడల్

నంద్యాల జిల్లా సంజామల మండలం పేరు సోములకు చెందిన దూదేకుల నడిపి మాబుసా, మాబుని దంపతుల రెండో కుమారుడు అయిన మహమ్మద్ రఫీ ఓ కేసులో ముద్దాయిగా తేలింది.

Written By:
  • Dharma
  • , Updated On : December 30, 2023 / 09:07 AM IST

    Nandyal

    Follow us on

    Nandyal: స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం గుర్తుంది కదూ. ఆ సినిమాలో ఖైదీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పట్టుదలతో లాయర్ విద్యను అభ్యసిస్తాడు. నిత్యం జైలు నుంచి కాలేజీకి వెళ్లి చదువుకుంటాడు. చివరకు లాయర్ గా మారి తన తండ్రి కేసును వాదిస్తాడు. తప్పుడు కేసు నుంచి విముక్తి కల్పిస్తాడు. అయితే ఇది సినిమా కాగా.. తాజాగా నిజ జీవితంలో కూడా ఒక ఘటన నంద్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మహమ్మద్ రఫీ అనే యువకుడు జీవిత ఖైదు అనుభవిస్తూ పీజీ పూర్తి చేశాడు. స్వర్ణ పతకాన్ని అందుకొని అబ్బురపరిచాడు.

    నంద్యాల జిల్లా సంజామల మండలం పేరు సోములకు చెందిన దూదేకుల నడిపి మాబుసా, మాబుని దంపతుల రెండో కుమారుడు అయిన మహమ్మద్ రఫీ ఓ కేసులో ముద్దాయిగా తేలింది. కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఆయన జైలు జీవితం అనుభవిస్తున్నారు. కానీ తనకు ఇష్టమైన చదువును కొనసాగించాలని భావించారు. జైలు అధికారుల సహకారంతో తాను అనుకున్నది సాధించారు.

    హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అత్యధిక మార్కులు సాధించి బంగారు పతకం సాధించారు. ఈ నెల 28న విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సులర్ జగదీష్ నుంచి పతకాన్ని అందుకున్నారు. జైలు జీవితంతో కృంగిపోకుండా అనుకున్నది సాధించిన మహమ్మద్ రఫీ కి అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి.