https://oktelugu.com/

Earthquake Today: చైనాలో పెను భూకంపం.. వణికిన ఢిల్లీ

భూకంప కేంద్ర సమీపంలో 3.0 కంటే ఎక్కువ తీవ్రతతో అంటే 14 గా భూకంప ఏర్పడిందట. ఢిల్లీ, ఎన్ సీఆర్ ప్రాంతాల్లో భూకంపాలు రావడం రెండవ సారి. గతంలో కూడా ఇలాంటి భూకంప సంభవించింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 23, 2024 / 09:59 AM IST

    Earthquake Today

    Follow us on

    Earthquake Today: ఈ మధ్య మరోసారి భూకంప వార్తలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రీసెంట్ గా మరోసారి భూకంపం రావడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఇంతకీ ఈ భూకంపం ఎక్కడ వచ్చింది. ఏమైనా ఆస్తి నష్టాలు సంభవించాయా? ప్రజలకు హానీ జరిగిందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…ఢిల్లీలోనూ, మరో వైపు చైనాలోని దక్షిణ జింజియాంగ్-కిర్గిజిస్థాన్ సరిహద్దుల్లో ఈ భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత ఏకంగా 7.2గా నమోదైంది. సోమవారం రాత్రి సంభవించిన ఈ భూకంపం చైనాలోని వుక్సీ కౌంటీలో కేంద్రంగా ఉంది.

    ఢిల్లీలో తీవ్రత..
    భూకంప కేంద్ర సమీపంలో 3.0 కంటే ఎక్కువ తీవ్రతతో అంటే 14 గా భూకంప ఏర్పడిందట. ఢిల్లీ, ఎన్ సీఆర్ ప్రాంతాల్లో భూకంపాలు రావడం రెండవ సారి. గతంలో కూడా ఇలాంటి భూకంప సంభవించింది. జనవరి 11న ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూ-కుష్ ప్రాంతాల్లో 6. తీవ్రతతో ఏర్పడిన భూకంపం ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో సంభవించింది.

    జిన్ జియాంగ్ లో భారత కాలమాన ప్రకారం రాత్రి 11.29 గంటలకు భూకంపం వచ్చిందట. అంటే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు కూడా కంపించాయని టాక్. ఇక పాకిస్థాన్ లో కూడా భూకంపం వచ్చిందంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే భూకంప తీవ్రత 80కి.మీ ల మేర కనిపించిందని తెలిపారు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ. దీని వల్ల అనేక మంది గాయపడ్డారట.. ఇల్లు కూడా దెబ్బతిన్నాయని సమాచారం. ఈ భూకంప తీవ్రత వల్ల జిన్ జియాంగ్ రైల్వే శాఖ కార్యకలాపాలను నిలిపివేసింది. దీంతో 27 రైల్లు సేవలను నిలిపివేశారు.

    ప్రకృతి వైపరిత్యాలు:
    మరో వైపు చైనాలో ప్రకృతి వైపరిత్యాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఇదిలా ఉంటే నైరుతి చైనాలోని మారుమూల పర్వత ప్రాంతంలో కూడా భారీ భూకంపం ఏర్పడింది. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీని వల్ల 47 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

    చైనాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి భూమి ఒక్కసారిగా కంపించింది. భూ ప్రకంపనల ధాటికి పలు భవనాలు కదిలిపోయాయి. కొన్నిచోట్ల భవనాలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. అయితే ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం బయటకు వెల్లడి కాలేదు. ప్రధానంగా వాయువ్య చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో భూమి భారీగా కంపించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రత నమోదైనట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది.

    భూకంప తీవ్రతను అమెరికాలోని భూ విజ్ఞాన కేంద్రం ధృవీకరించింది. ఉషీ కౌంటీలోని ఓ టౌన్ షిప్ పరిధిలో భూమికి 22 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించింది. తరువాత 5.3 తీవ్రతతో పలుమార్లు భూమి కంపించినట్లు వివరించింది. భూకంప కేంద్రం చైనా, కిర్గిజిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ ప్రభావం ఢిల్లీలోనూ కనిపించింది.