Ugadi 2022 Special: శ్రీ శుభకృత్ సంవత్సరంపై ప్రజలు భారీగానే ఆశలు పెంచుకున్నారు. ఇన్నాళ్లు కరోనా భారంతో పండుగ చేసుకునేందుకు కూడా వెనకాడిన ప్రజలు కరోనా ప్రభావం తగ్గడంతో స్వేచ్ఛగా పండుగ చేసుకోవాలని భావించినా పరిస్థితులు మాత్రం అనుకూలించడం లేదనే తెలుస్తోంది. దీంతో అతలాకుతలమైపోతున్నారు. భవిష్యత్ బాగుండాలని ఆకాంక్షించినా వర్తమానమే సరిగా లేదు. పెరుగుతున్న ధరాభారంతో ప్రజలు కుదేలైపోతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రో ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి.
గతంలో పండగ అంటే కొనుగోళ్లతో దుకాణాలు సందడి చేసేవి. అప్పుడున్న పరిస్థితుల కారణంగా అలా ఉండేది. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు ఆందోళన పెంచుతున్నాయి. ఆదాయం కర్పూరంలా కరుగుతోంది. పెట్రోధరలు రోజురోజుకు పెరగడం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. దీంతో ఏం కొనడానికి కూడా ముందకు రావడం లేదు. ప్రజలపై పడుతున్న భారంతో కుంగిపోతున్నారు.
పెట్రో ధరలతో పాటు విద్యుత్ చార్జీలు కూడా పెంచుతున్నారు. దీంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువవుతోంది. బతుకు భారం కానుందనే బెంగ పట్టుకుంటోంది. సమయానికి జీతాలు కూడా రావడం లేదు. ఉద్యోగులు కూడా పండుగ సరైన తీరుగా జరుపుకోవడానికి వెనుకాడుతున్నట్లు సమాచారం. సామాన్యులకైతే భారం మోయలేని విధంగా ఉంటోందని తెలుస్తోంది. ప్రభుత్వాల నిర్ణయంతో జీవితాలు ముందుకు సాగడం లేదనే వాదనలు కూడా వస్తున్నాయి.
ప్రభుత్వాలు తమ ఆదాయం పెంచుకునేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాయి. ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారు. దీంతో జీవనగమనం ముందుకు సాగడం లేదు. కరోనా పరిస్థితి పూర్తిగా మారిపోయినా దాని తాలూకు గుర్తులు మాత్రం పోవడం లేదు. కరోనా పోయినా పన్నుల రూపంలో ప్రజలను పీడిస్తూనే ఉంది. దీంతో శుభకృత్ సంవత్సరంపై భారీగానే ఆశలు పెంచుకున్నారు. ఏదిఏమైనా ఈ సంవత్సరం ప్రజల బతుకు మార్చేందుకు శుభకృత్ సహకరిస్తుందా వేచి చూడాల్సిందే.
తెలుగువారి సంవత్సరాదిగా ఉగాదికి గుర్తింపు ఉంది. అందుకే ప్రతి సంవత్సరం ఉగాది నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుందని నమ్ముతారు. పనులు మొదలుపెడతారు. సాగుకు ముందు నిలుస్తారు. ఉగాదితో తమ బతుకుల్లో మార్పు వస్తుందని భావిస్తున్నారు. పచ్చడి తింటూ పంచాంగ శ్రవణం చేస్తూ భవిష్యత్ బంగారంగా ఉండాలని ఆకాంక్షిస్తారు. ఈ నేపథ్యంలో శుభకృత్ తెలుగువారి ఇంట సిరులు కురిపించాలని కోరుకుంటున్నారు.
Also Read:Tata IPL 2022: బోణీ కోసం ముంబై.. ఆధిపత్యం కోసం రాజస్థాన్.. బలబలాలు ఇవే..!