Sri Lanka vs Pakistan : ఏషియా కప్ ఫైనల్ లో ఇండియాని ఢీ కొట్టేది ఎవరు..?

ప్రస్తుతం ఈ రెండు టీములు ఉన్న ఫామ్ ని బట్టి చూస్తే శ్రీలంక టీం కె ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నట్టు గా తెలుస్తుంది.ఎందుకంటే ఈ టీం లో ఉన్న ప్లేయర్లు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్ కి చేరుకునే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయి...

Written By: Gopi, Updated On : September 14, 2023 12:45 pm
Follow us on

Sri Lanka vs Pakistan : ఏషియాకప్ లో భాగంగా శ్రీలంక పాకిస్తాన్ మధ్య ఒక మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ లో ఏ టీం అయితే విజయం సాధిస్తుందో ఆ టైం కి మాత్రమే ఇండియా తో పాటు ఫైనల్ లో ఆడే అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండు టీంలు కూడా ప్రస్తుతం చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు టీములు కూడా ఆల్రెడీ చెరొక మ్యాచ్ గెలిచి రెండు పాయింట్లు తో రెండు సేమ్ పొజిషన్ లో ఉన్నాయి ఇక ఈ రెండు టీములు కూడా ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో పాకిస్తాన్ కంటే శ్రీలంక కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది. పాకిస్తాన్ టీం కూడా ఇప్పటికే ప్రపంచ నెంబర్ వన్ వన్డే టీం గా కొనసాగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా ఎవరు విజయం సాధిస్తారు అనేది చాలా కీలకం గా మారింది. ఒకసారి ఈ రెండు టీంలా బలాలు బలహీనతలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం…

ముందు గా శ్రీలంక టీం గురించి చూస్కుంటే ఈ టీం కి మొదటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మ్యాచ్ ఆడుతుంది వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో కాబట్టి వాళ్ళకి అది చాలా కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. నిజానికి శ్రీలంక లాంటి ఒక టీం ఇండియా కె చెమటలు పట్టించింది అంటే ఇక వాళ్ళకి పాకిస్థాన్ టీం ని కట్టడి చేయడం పెద్ద కష్టం అయితే కాదు. శ్రీలంక బౌలింగ్ విషయానికి వస్తే వెల్లలాగే, అసలంక, మహేష్ తీక్షణ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. ఇక వీళ్లు తమ బౌలింగ్ తో పాకిస్థాన్ టీంలను ఈజీగా కట్టడి చేస్తారు.ఇక ఈ టీం లో ఉన్న కొద్దీ పాటి బలహీనత ఏంటంటే వీళ్లు బౌలింగ్ లో స్ట్రాంగ్ గా ఉన్న కూడా బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ టీం కొద్దీ గా తడపడుతున్నట్టు గా తెలుస్తుంది.సధీర సమరవిక్రమ,కుశాల్ మెండీస్, నిసంక లాంటి ప్లేయర్లు చాలా బాగా ఆడుతున్నప్పటికీ వాళ్ళు కన్సిస్టెన్సీ తో ఆడటం లేదు.అదొక్కటి ఈ టీం కి మైనస్ గా మారనుందని తెలుస్తుంది…

ఇక పాకిస్థాన్ బలబలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం...పాకిస్థాన్ టీం విషయానికి వస్తే ఈ టీం కి ఉన్న ప్రధానమైన బలం ఏంటి అంటే బ్యాటింగ్ అనే చెప్పాలి.ఈ టీం లో ఉన్న ఓపెనర్లు అయినా ఇమామ్ ఉల్ హాక్,ఫకర్ జమాన్ లాంటి ప్లేయర్లు బాబర్ అజమ్,మహమ్మద్ రిజ్వాన్ లాంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ వీళ్ళందరూ పెద్దగా ఫామ్ లో లేరు అదే పాకిస్థాన్ టీం కి పెద్ద ప్లస్ పాయింట్ అనుకుంటే ఇప్పుడు బ్యాటింగే వాళ్లకి మైనస్ గా మారింది…ఇక ఈ టీం లో ఉన్న మరో ప్లస్ పాయింట్ ఏంటి అంటే బౌలింగ్ అనే చెప్పాలి. కానీ హారిస్ రాఫ్,నషీమ్ షా లాంటి బౌలర్లు చాలా మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ వీళ్లిద్దరు ఈ మ్యాచ్ లో ఆడటం లేదనే విషయం స్ఫష్టం గా తెలుస్తుంది.ఎందుకంటే వీళ్లు గత మ్యాచ్ లో గాయాల బారిన పడటమే దానికి ప్రధాన కారణం అనే చెప్పాలి…

ఇక ప్రస్తుతం ఈ రెండు టీములు ఉన్న ఫామ్ ని బట్టి చూస్తే శ్రీలంక టీం కె ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నట్టు గా తెలుస్తుంది.ఎందుకంటే ఈ టీం లో ఉన్న ప్లేయర్లు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్ కి చేరుకునే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయి…