South No. 1 Hero : దర్శక ధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి సినిమా సూపర్ సక్సెస్ అవడంతో ఒక్కసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తాను చాటుకుంది. ఇక రాజమౌళి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో సౌత్ సినిమా డైరెక్టర్లు అందరూ పాన్ ఇండియా లో సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోలకు, దర్శకులకు అందనంత ఎత్తులో ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీ ఉండడం అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ పొజిషన్ లో ఉండడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.
ముఖ్యంగా ఇది కేవలం రాజమౌళి వల్లే సాధ్యమైంది. ఇక ఇదిలా ఉంటే సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో తమ సత్తాను చాటుకున్న హీరోలలో ప్రభాస్, యష్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలైతే ఉన్నారు. అయితే వీళ్ళలో ఇప్పటి వరకు ఎవరు టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు అనే న్యూస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…
ఇక దీంట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి నలుగురు హీరోలు ఉండటం విశేషం.. ఏది ఏమైనప్పటికీ ఇప్పటివరకు ప్రభాస్ తన నాలుగు సినిమాలతో 300 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి తన సత్తా ఏంటో చాటుకున్నాడు. కాబట్టి ఇప్పటివరకైతే ప్రభాస్ పాన్ ఇండియా లో నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు. అలాగే సౌత్ సినిమా ఇండస్ట్రీ లో కూడా ప్రభాసే నెంబర్ వన్ హీరో గా కొనసాగుతున్నాడు…
ఆయన చేసిన బాహుబలి, బాహుబలి 2, సాహో, ఆది పురుషు, సలార్ లాంటి సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించి ఇండియాలోనే టాప్ టెన్ వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలవడంతో ఆయన క్రేజ్ అనేది తారా స్థాయికి చేరిపోయిందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా బాహుబలి 2 సినిమాతో 2000 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఏకైక ఇండియన్ హీరోగా కూడా ప్రభాస్ చరిత్ర సృష్టించడం నిజంగా మనందరం గర్వపడాల్సిన విషయమనే చెప్పాలి…