https://oktelugu.com/

Under-19 World Cup : జూనియర్‌ జడేజా.. అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌లో అదరగొడుతున్న సౌమి పాండే!

ఈ వీడియో చూసినక్రికెట్‌ అభిమానులు అచ్చం.. జడేజాను తలపిస్తున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : February 7, 2024 / 04:09 PM IST
    Follow us on

    Under-19 World Cup : టీమిండియాలో చోటు దక్కడం ఒక అదృష్టంగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న పోటీలో భారత జట్టుకు ఆడేందుకు వందల మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. కానీ, ఫైనల్‌ జట్టుకు ఎంపికయ్యేది 50 మందిలోపే.. ఇలాంటి తరుణంలో యువ క్రికెటర్లు సత్తా చాటితేనే టీమిండియాలో ఛాన్స్‌ దక్కుతుంది. కెప్టెన్‌ రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లి స్థానాలు మినహా మిగతా 9 స్థానాలకు ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. స్టార్‌ క్రికెటర్లుగా గుర్తింపు ఉన్నవారు కూడా జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడానికి శ్రమిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కొత్త ఆటగాళ్లు జట్టులోకి రావడం చాలా కష్టంగా మారింది. అయితే టీ20, ఐపీఎల్‌లో మాత్రం ప్రతిభ ఉన్న కుర్రాళ్లకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌ ఉన్న నేపథ్యంలో భారత టీ20 జట్టులో చోటు దక్కించుకోవడానికి చాలా మంది కుర్రాళ్లు పోటీ పడుతున్నారు.

    అండర్‌ –19 వరల్డ్‌ కప్‌పై బీసీసీఐ దృష్టి..
    మళ్లీ నాలుగేళ్లకు జరిగే వన్డే వరల్డ్‌ కప్‌తోపాటు, టీ20 క్రికెట్‌ జట్టు కూర్పు కోసం బీసీసీఐ ఇప్పుడు యువ ఆటగాళ్ల కోసం గాలిస్తోంది. వచ్చే వన్డే వరల్డ్‌ కప్‌ నాటికి ప్రస్తుత టీమిండియాలో 50 శాతం మంది రిటైర్‌ అయ్యే అవకాశం ఉంది. జట్టు సుదీర్ఘ ప్రయోజనాల నేపథ్యంలో బీసీసీఐ కుర్రాళ్లను వెతుకుతోంది.

    బీసీసీఐ కంట జూనియర్‌ జడేజా..
    ఈ తరుణంలో ఓ కుర్రాడు బీసీసీఐ కంట పడ్డాడు. భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజాను తలపించే అద్భుతమైన స్పిన్‌తో ఆకట్టుకుంటున్నాడు. ప్రత్యర్థుల వికెట్ల పడగొడుతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతన్ని సరిగ్గా సానబెట్టి వాడుకుంటే.. టీమిండియాకు మ్యాచ్‌ విన్నర్‌ అవుతాడని క్రికెట్‌ పండితులు కూడా చెబుతున్నారు. క్రికెట్‌ నిపుణుల కళ్లలో పడిన ఆ యువ క్రికెటర్‌ సౌమి పాండే.

    లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్‌..
    అండర్‌ – 19 వరల్డ్‌ కపన్‌లో టీమిండియా తరఫున అదరగొడుతున్న సౌమి పాండే లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 9.5 ఓవర్లు వేసి కేవలం 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్లాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసిన పాండే 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 10 ఓవర్లు వేసి కేవలం 19 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్‌లోనూ 10 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు.

    అచ్చం జడేజాలా..
    ఇక ఈ యువ బౌలర్‌ ప్రస్తుత సీనియర్‌ బౌలర్‌ రవీంద్రజడేజాలానే బంతిని తిప్పుతున్నాడు. ఐసీసీ ఈమేరకు సోషల్‌ మీడియాలో ఇద్దరి బౌలింగ్‌ను పోలుస్తూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియో చూసినక్రికెట్‌ అభిమానులు అచ్చం.. జడేజాను తలపిస్తున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.