Atmakur By Election: ఎప్పుడూ బీజేపీ ప్రకటించడం.. పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపడమేనా? ఒకసారి జనసేన పోటీచేస్తే చూడాలని అటు జనసైనికులు.. ఇటు ఏపీ రాజకీయవర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఎందుకంటే అధికార వైసీపీని ఓడిస్తానని.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ప్రతిజ్ఞ చేసిన పవన్ కళ్యాణ్ ఆ మాటను నిలబెట్టుకోవాలంటే ముందుగా పోటీచేయాలి. వైసీపీని ఢీకొట్టాలి. టీడీపీ, బీజేపీని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి.

జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీకి ఆసక్తి లేకపోవడం.. అదే సమయంలో బీజేపీ గెలుపుపై ఆశలు లేకున్నా పోటీచేస్తానని దూకుడు ప్రదర్శించడం పరిపాటిగా మారింది. పైకి జనసేన+బీజేపీ పొత్తు అని అంటున్నా బీజేపీ మాత్రం ఎన్నికలు అనేసరికి సమరానికి సై అంటోంది. అసలు తమ మిత్రపక్షం జనసేనను పట్టించుకోకుండా కయ్యానికి కాలుదువ్వుతోంది.
Also Read: KCR- Regional parties: ప్రాంతీయ పార్టీలతో రాజకీయసంద్రంలోకి కేసీఆర్.. మునుగుతారా.. తేలుతారా
ఇదివరకూ బద్వేలు నియోజకవర్గంలో ఉప ఎన్నికలప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ మరణించిన వైసీపీ ఎమ్మెల్యేకు సానుభూతిగా ఎవరూ పోటీచేయవద్దని ఏకగ్రీవం చేయాలని పిలుపునిచ్చాడు. ఆపిలుపునకు ఆశ్చర్యకరంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించి పోటీచేయలేదు. కానీ పొత్తు పెట్టుకున్న మిత్రపక్షం బీజేపీ మాత్రం పవన్ మాటను పెడచెవిన పెట్టి బద్వేలులో పోటీచేసింది. ఘోరంగా ఓడి చేతులు కాల్చుకుంది.

ఇప్పుడు మాజీ మంత్రి మేకపాటి మరణంతో ‘ఆత్మకూరు’ ఉప ఎన్నిక వచ్చిపడింది. ఈ నియోజకవర్గంలో జనసేన పోటీచేయాలని సత్తా చాటాలని అనుకుంటుండగానే.. ఆ పార్టీతో సంబంధం లేకుండా ఏకంగా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డైరెక్ట్ ప్రకటన చేశాడు. ఆత్మకూరులో ‘బీజేపీ’ పోటీచేస్తుందని ప్రకటించారు. జనసేనతో సంప్రదించకుండానే ఈప్రకటన చేయడం దుమారం రేపింది.
అయితే బీజేపీ కంటే ఇక్కడ జనసేన పోటీచేయాలని జనసైనికులు.. రాజకీయ పార్టీల శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఎప్పుడూ బీజేపీ పోటీచేయడం.. జనసేన మద్దతివ్వడం చూస్తేనే ఉన్నాం.. ఎన్నికల్లో పోటీచేస్తేనే ఏపార్టీకైనా బలం బలగం తెలుస్తుంది. అధికార గుర్తింపు, గుర్తు దక్కుతుంది. ఈ విషయంలో జనసేనాని ఇప్పటికైనా తీరు మార్చుకొని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగి అటు జనసైన నేతలకు బూస్ట్ నివ్వడంతోపాటు రాజకీయంగా యాక్టివ్ కావడానికి స్కోప్ ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకతను బయటపెట్టినట్టు అవుతంది. ఆ దిశగా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తాడని అందరూ ఆశిస్తున్నారు.
Also Read:KCR Third Front: ఫ్రంట్ కోసం పట్టు వదలకుండా.. 2024కు కేసీఆర్ రోడ్‌మ్యాప్!!
[…] […]
[…] […]