https://oktelugu.com/

Social Media Addiction : 18 ఏళ్లు దాటితేనే ఇక సోషల్ మీడియా..!?

ఈ సోషల్ మీడియానే పిల్లలకు దూరం చేయాలని అప్పుడే బాగుపడుతారన్న కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది సరైన నిర్ణయం అని మేధావులు, విద్యావేత్తలు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 21, 2023 10:42 pm
    Follow us on

    Social Media Addiction : పత్రికలు పక్కనపడ్డాయి.. టీవీలు మూతపడ్డాయి. ఇప్పుడు అంతా సోషల్ మీడియా.. ఫోన్ ఉంటే చాలు పత్రికలు, టీవీలు, అంతా అందులోనే చూడొచ్చు. అంతా స్మార్ట్ ఫోన్ యుగం ఇదీ. అయితే ఇదొక వ్యసనంగా కూడా మారుతోంది. ముఖ్యంగా టీనేజ్ యువతను బానిసగా మార్చి బలితీసుకుంటోంది. అందుకే ఈ సోషల్ మీడియాను టీనేజర్లకు దూరంగా పెట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది.

    తాజాగా సోషల్ మీడియా వినియోగానికి 18 ఏళ్ల వయోపరిమితిని పెట్టాలని కర్ణాటక హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది దేశవ్యాప్తంగా ఓ చర్చకు దారితీసింది. ఎందుకంటే సోషల్ మీడియా కారణంగా యువత వ్యసనపరులుగా మారుతున్నారన్న హైకోర్టు డివిజన్ బెంచ్ వాదన సహేతుకంగానే కనిపిస్తోంది.

    టీనేజ్ యువతను నియంత్రించడం దేశ ప్రయోజనాలకు మంచిదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓటు హక్కుకు మాదిరే పరిమితి విధించాలన్న కోర్టు నిర్ణయం సబబుగానే కనిపిస్తోంది.

    కర్ణాటక హైకోర్టు సామాజిక మాధ్యమాల విషయంలో కీలక అభిప్రాయాలను వ్యక్తం చేసింది. యువతను, ముఖ్యంగా స్కూల్ పిల్లలను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచడం దేశ ప్రయోజనాలకు మంచిదని వ్యాఖ్యానించింది. అసలు సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశానికి గాను కనీసం 21 ఏళ్లు లేదంటే ఓటు హక్కుకు అమలు చేస్తున్నట్టుగా 18 ఏళ్ల వయోపరిమితి ఉండాలని పేర్కొంది.

    ట్విట్టర్ దాఖలు చేసిన ఓ వ్యాజ్యంపై కోర్టు విచారణ నిర్వహించింది. స్కూల్ కు వెళ్లే విద్యార్థులు సోషల్ మీడియాకు వ్యసన పరులుగా మారుతున్నట్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ కేసులో బుధవారం తన తీర్పును వెలువరించనున్నట్టు ప్రకటించింది.

    ట్విట్టర్ లో కంటెంట్ బ్లాక్ కు వీలుగా లోగడ సింగిల్ జడ్జి బెంచ్ జారీ చేసిన ఆదేశాలను ట్విట్టర్ సవాలు చేయడంతో దీనిపై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అసలు ఈ సోషల్ మీడియానే పిల్లలకు దూరం చేయాలని అప్పుడే బాగుపడుతారన్న కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది సరైన నిర్ణయం అని మేధావులు, విద్యావేత్తలు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.