https://oktelugu.com/

Hardik Pandya : హార్దిక్ పాండ్యా పై ఇంత ద్వేషమా?

గత సీజన్ లో రన్నరప్ ను చేశాడు. అలాంటి హార్దిక్ ప్రస్తుతం ముంబై జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఆదివారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ నేతృత్వంలోని ముంబై జట్టు ఓడిపోయింది. దీంతో విమర్శలు తీవ్రమయ్యాయి. రోహిత్ శర్మ కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంతో.. అభిమానులు చాలామంది అతనిపై వ్యతిరేకత పెంచుకున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 25, 2024 9:12 am
    So much hate on Hardik Pandya?

    So much hate on Hardik Pandya?

    Follow us on

    Hardik Pandya : క్రికెట్ ను ఒక మతం గా ఆచరించే దేశం మనది. ఎటువంటి ప్లేయర్ అయినా.. చివరికి పాకిస్తాన్ క్రీడాకారులైనా మన దేశ ప్రజలు అభిమానిస్తారు. వారు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడితే అభినందిస్తారు. కానీ అలాంటి మనదేశంలో.. మన దేశ క్రికెటర్ పై విపరీతమైన ద్వేషం వ్యక్తమవుతోంది. గతంలో కొంతమంది మహమ్మద్ షమీపై ద్వేషం వ్యక్తం చేస్తే.. చాలామంది అతనికి సంఘీభావంగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా షమీకి అండగా నిలిచారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఒక ఆటగాడు, కెప్టెన్ పై అభిమానులు ఆగ్రహం విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ఐపీఎల్ ప్రారంభం కంటే ముందే గుజరాత్ జట్టు నుంచి ట్రేడింగ్ పద్ధతిలో ముంబై జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వచ్చాడు. అప్పటినుంచి అతనిపై ఆగ్రహం అభిమానులకు తారాస్థాయికి చేరింది. వాస్తవానికి హార్దిక్ పాండ్యా మంచి ఆటగాడు. ఎంట్రీ సీజన్ లోనే గుజరాత్ జట్టును విజేతగా నిలిపాడు. గత సీజన్ లో రన్నరప్ ను చేశాడు. అలాంటి హార్దిక్ ప్రస్తుతం ముంబై జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఆదివారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ నేతృత్వంలోని ముంబై జట్టు ఓడిపోయింది. దీంతో విమర్శలు తీవ్రమయ్యాయి. రోహిత్ శర్మ కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంతో.. అభిమానులు చాలామంది అతనిపై వ్యతిరేకత పెంచుకున్నారు.

    “పాండ్యా సీనియర్లకు గౌరవం ఇవ్వరు. అతడికి అతి విశ్వాసం ఎక్కువ. గాయాల పేరుతో అంతర్జాతీయ మ్యాచులు ఆడడు. కానీ ఐపీఎల్ సమయానికి ఫిట్ అవుతాడని” అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు.. కానీ ఇదే హార్దిక్ పాండ్యాకు ముంబై జట్టుతో సుదీర్ఘ అనుబంధం ఉంది. అతడు రోహిత్ శర్మ ఆధ్వర్యంలో చాలా సంవత్సరాల పాటు ఆ జట్టుకు ఆడాడు. ఐపీఎల్ లో ఐదుసార్లు విజేతగా ఆవిర్భవించిన ముంబై జట్టులో అతడు కీలక సభ్యుడు. సుదీర్ఘ ఇన్నింగ్స్ కూడా ఆడాడు.

    అయితే అభిమానులు తనపై ఈ స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం పట్ల అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ అతడు అలాంటి వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు ఆట మాత్రమే ఆడతారని.. ఇందులో ఆట తీరు మాత్రమే చూడాలని.. వ్యక్తిగతంగా కక్షలు పెంచుకుంటే.. అన్ని లోపాలే కనిపిస్తాయని అతడు వ్యాఖ్యానించాడు.. అయినప్పటికీ అతనిపై నెగిటివ్ కామెంట్స్ ఆగడం లేదు. అభిమానుల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముంబై జట్టు యాజమాన్యం ఇటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.