https://oktelugu.com/

Tillu Square Trailer : టిల్లు స్క్వేర్ ట్రైలర్ రివ్యూ : తన బాడీలో వీక్ పార్ట్ ఏదో చెప్పిన అనుపమ, టిల్లు ఈజ్ బ్యాక్!

శ్రీచరణ్ పాకాల అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది. విడుదలైన సాంగ్స్ ఆదరణ దక్కించుకున్నాయి. మార్చి 29న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.

Written By:
  • NARESH
  • , Updated On : February 14, 2024 / 08:02 PM IST
    Follow us on

    Tillu Square Trailer : 2022లో వచ్చిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్. బడ్జెట్ కి రెండు మూడు రెట్ల వసూళ్లు సాధించింది. న్యూ ఏజ్ లవ్ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహ శెట్టి జంటగా నటించారు. సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో యూత్ ని ఆకట్టుకుంది. హీరో క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతుంది. డీజే టిల్లు కి మించిన ఫన్, రొమాన్స్, థ్రిల్స్ తో టిల్లు స్క్వేర్ సిద్ధం అవుతుంది. మూడున్నర నిమిషాల ట్రైలర్ అదిరిపోయింది.

    టిల్లు ఈజ్ బ్యాక్ అని చెప్పాలి. సిద్ధు జొన్నలగడ్డ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, యాటిట్యూడ్ కేక. అనుపమ పరమేశ్వరన్ తో ఆయన కెమిస్ట్రీ, డ్రామా అదుర్స్ . యూత్ లో విపరీతమైన అంచనాలు పెంచేసేలా టిల్లు స్క్వేర్ ట్రైలర్ ఉంది. ఇక అనుపమతో ముద్దు సన్నివేశాలు హద్దులు దాటేశాయి. బాలీవుడ్ భామలను మించిపోయి లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది అనుపమ పరమేశ్వరన్.

    నీ బాడీ లో వీక్ పార్ట్ ఏంటని… సిద్దూ అడగ్గా, నా కళ్ళు అని అనుపమ చెప్పింది. మరి నీ బాడీలో వీక్ పార్ట్ ఏంటని సిద్దూని అనుపమ అడుగుతుంది… నా గుండె అని సమాధానం చెబుతాడు. డైలాగ్స్ కొత్తగా ఉన్నాయి. టైటిల్ కి న్యాయం చేసేలా టిల్లు స్క్వేర్ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది అనడంలో సందేహం లేదు. టిల్లు స్క్వేర్ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

    శ్రీచరణ్ పాకాల అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది. విడుదలైన సాంగ్స్ ఆదరణ దక్కించుకున్నాయి. మార్చి 29న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. కాగా టిల్లు స్క్వేర్ మూవీపై అనేక పుకార్లు వినిపించాయి. డీజే టిల్లు చిత్రానికి దర్శకత్వం వహించిన విమల్ కృష్ణను తప్పించారు. నేహా శెట్టి వెళ్లిపోవడంతో అనుపమ పరమేశ్వరన్ ని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అనంతరం ఆమె కూడా తప్పుకుంది. శ్రీలీల లేదా మడోన్నా సెబాస్టియన్ నటిస్తారంటూ కథనాలు వెలువడ్డాయి. నిజానికి అనుపమ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోలేదు.