Siddharth Roy Movie Review : సిద్ధార్థ్ రాయ్ మూవీ ఫుల్ రివ్యూ…

ఇక హీరో ఫాదర్ క్యారెక్టర్ లో ఆనంద్ భారతి చాలా సెటిల్డ్ గా నటించాడు. ఇక వీళ్ళని మినహాయిస్తే ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ అయితే ఏమీ లేవు...

Written By: Gopi, Updated On : February 26, 2024 8:50 am
Follow us on

Siddharth Roy Movie Review : ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి సినిమా తీసే దర్శకుల ఆలోచన, సినిమాలు చూసే ప్రేక్షకుడి ఇష్టాలు మారుతూ ఉంటాయి. 1990 వ సంవత్సరంలో శివ సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఆయన ఒక టార్చ్ బేరర్ లా మారాడు. ఇక అప్పటినుంచి ఆయన వేసిన రూట్ లోనే దర్శకులు అందరూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. 2017 వ సంవత్సరంలో సందీప్ రెడ్డి వంగ అనే ఒక దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసే విధంగా ‘అర్జున్ రెడ్డి ‘ సినిమా చేసి ప్రేక్షకుల అటెన్షన్ మొత్తాన్ని గ్రాప్ చేసుకున్నాడు…

ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీయడం కాదు, మనకు నచ్చిన స్టోరీ ని ప్రేక్షకులు మెచ్చే విధంగా తీయాలి అనే కాన్సెప్ట్ తో అర్జున్ రెడ్డి సినిమాను తీసి హిట్ కొట్టడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. అప్పటి నుంచి అదే ఫార్మాట్లో చాలామంది దర్శకులు సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు యశస్వి అనే ఒక కొత్త దర్శకుడు ‘సిద్దార్థ్ రాయ్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ట్రైలర్ ని చూస్తున్నంత సేపు అర్జున్ రెడ్డి ఫ్లేవర్ కనిపిస్తుంది. హీరో బాడీ లాంగ్వేజ్ లో గాని, కాస్ట్యూమ్స్ లో గానీ, హెయిర్ స్టైల్ లో గానీ బిహేవియర్ లో గానీ, ఆటిట్యూడ్ లో గానీ మొత్తం అర్జున్ రెడ్డిని యాజ్ టీజ్ గా దింపేసినట్టు గా ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన సినిమా మేధావులు సైతం అర్జున్ రెడ్డి 2.0 అంటూ ఈ సినిమా గురించి అభివర్ణిస్తున్నారు… మరి ఈ సినిమా ఎలా ఉంది.? అర్జున్ రెడ్డి సినిమాలానే ఈ సినిమా కూడా ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్టు సాదించిందా.? కొత్త దర్శకుడు అయిన యశస్వి తన మొదటి ప్రయత్నం లో సక్సెస్ అయ్యాడా.? లేదా అనే విషయాలని మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ప్రదీప్ రాయ్ (ఆనంద్ భారతి) అనే ఒక పెద్ద బిజినెస్ మాన్ కి సిద్దార్థ్ రాయ్ (దీపక్ సరోజ్) అనే ఒక కొడుకు ఉంటాడు. 12 సంవత్సరాలకి ఫిలాసఫీకి సంబంధించిన బుక్స్ మొత్తం చదివడం వల్ల సిద్ధార్థ రాయ్ లాజిక్కులకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ, ఎమోషన్స్ ను అసలు పట్టించుకోడు. ఏది జరగాలన్న అది లాజిక్స్ ప్రకారమే జరుగుతుంది. ఎమోషన్స్ మనుషులను వీక్ చేస్తాయి తప్ప స్ట్రాంగ్ చేయవు అని బలంగా నమ్మే క్యారెక్టర్ తనది. అందుకే తనకు ఆకలేస్తే కడుపు నింపుకోవడానికి ఆకులను తింటాడు, నిద్ర వస్తె రోడ్ మీదైన సరే పడుకుంటాడు. ఇక తనకి మూడ్ వస్తె దగ్గర్లో ఎవరు ఉంటే వాళ్ళని వాడుకుంటాడు. ఇక మొత్తానికైతే మనిషి కి తిండి, నిద్ర, సెక్స్ మాత్రమే ముఖ్యం అని నమ్ముతాడు. మరి ఇలాంటి క్యారెక్టర్ ఉన్న హీరోకి ఇందుమతి (తన్వి నేగి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె మతం మన లైఫ్ లో ఎమోషన్స్ చాలా ముఖ్యం అని నమ్ముతుంది. అలాంటి అమ్మాయి సిద్దార్థ్ రాయ్ చేత ఎలా ప్రేమించబడుతుంది. మరి లాజిక్స్ మాత్రమే నమ్మే హీరో ఎమోషన్స్ కి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాడు అనే పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించాడు. మరి చివర్లో ఇందుమతి, సిద్ధార్థ రాయ్ ఇద్దరు కలిసారా లేదా అనే విషయం తెలియాలంటే మీరు ఈ సినిమాని చూడాల్సిందే…

విశ్లేషణ

ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే డైరెక్టర్ యశస్వి ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ని లాజిక్స్ మాత్రమే నమ్ముతూ, ఎమోషన్స్ కి వాల్యూ ఇవ్వడు అనే విధంగా డిజైన్ చేశాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ లో మాత్రం హైలీ ఎమోషనల్ పర్సన్ గా హీరోలో ఒక చెంజోవర్ ను చూపిస్తాడు. ఎంతలా అంటే ఒక క్షణంలోనే ఆయన ఎమోషన్స్ అనేవి రకరకాలు గా మారిపోతూ ఉంటాయి…అయితే ఈ సినిమా కోసం యశస్వి ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో మాత్రం ఆయన చాలా వరకు తడబడ్డాడు. ఇక తనకి ఇది మొదటి కావడం వల్లే చాలా కన్ఫ్యూజన్ అయ్యాడనే విషయం అయితే మనకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే హీరోయిన్ చాలా బోల్డ్ గా నటించింది. చిన్న పిల్లలు ఫ్యామిలీ చూడలేని కొన్ని సీన్లు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో లాజిక్స్, ఎమోషన్స్ మధ్య వచ్చే ఒక సీను మాత్రం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే చెప్పాలి. ఇక ఆ ఒక్క సీన్ ను మినహాయిస్తే ఈ సినిమాలో ప్రేక్షకుల్ని పెద్దగా ఎంగేజ్ చేసే సీన్స్ అయితే ఏమీ లేవు. ఫస్టాఫ్ ఓకే అనిపించినప్పటికీ సెకండాఫ్ మాత్రం సినిమాని తెరకెక్కించిన విధానం చాలా వరస్ట్ గా ఉందనే చెప్పాలి.

హీరోయిన్ చేత ఎమోషన్ కి గురైన హీరో సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ను విపరీతంగా ప్రేమిస్తాడు. ఆ ప్రేమే ఆయనకు శాపంగా మారుతుంది… హీరో ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్ లో హీరోయిన్ సెకండ్ హాఫ్ లో చాలా అద్భుతంగా నటించింది. కానీ దర్శకుడు ఈ పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా, హీరో ఎమోషన్స్ అనేవి అసలు బ్యాలెన్స్ లేకుండా పోతున్నాయి. వాటిని ఎవరు బ్యాలెన్స్ చేయలేరు అనేలా స్క్రీన్ ప్లే రాసుకోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. ఒకానొక స్టేజ్ లో హీరోయిన్ అయిన ఇందు చెబితే సిద్ధార్థ్ రాయ్ వింటాడు. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటాడు దాని మీదే సెకండాఫ్ రన్ చేసి సైకలాజికల్ గా హీరో ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు అని చూపిస్తే సరిపోయేది. కానీ తను ఎవరికోసం ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోలేడు అనేలా క్యారెక్టర్ ని డిజైన్ చేయడం అనేది రియలేస్టిక్ గా ఒకే అనిపించినప్పటికీ దాని ద్వారా జరిగే అనర్థాలను సినిమా చూసే ప్రేక్షకుడు జీర్ణించుకోలేకపోయాడు. ఇక ఈ సినిమాలో కొన్ని ఇల్లాజికల్ సీన్స్ కూడా ఉన్నాయి. హీరో హీరోయిన్ నైట్ బెంజ్ కార్ లో వెళ్తుంటే రోడ్డుమీద బైక్ మీద వెళుతున్న ఒకడు వాళ్ళని టీజ్ చేస్తాడు. అప్పుడు హీరో ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. బెంజ్ కార్ లో వెళ్లేవాడిని బైక్ మీద వెళ్లేవాడు ఎందుకు కామెంట్ చేస్తాడు. ఇది చాలా ఇల్లాజికల్ సీన్ అనే చెప్పాలి. ఒకవేళ వాడితో ఇంతకు ముందు ఏదైన గొడవ జరిగి ఉంటే వాడు వీళ్ళను టార్గెట్ చేసి కామెంట్ చేశాడు అంటే అది లాజికల్ గా అనిపించొచ్చు.

కానీ ఏ సంబంధం లేని వాడు కారు లో వెళ్తున్న వారిని ఎందుకు టీజ్ చేస్తాడో అర్థం కాదు. దాని ద్వారా ఒక పెద్ద ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది. అదంతా చూసే ప్రేక్షకుడికి ఇల్లాజికల్ గా అనిపిస్తుంది… ఇంకా కొన్ని సీన్లు మాత్రం చాలా ఓవర్ గా డిజైన్ చేసినట్టుగా అనిపించింది… ఇక సినిమాలో ఎక్కడ కూడా హై ఇచ్చే సీన్ ఒక్కటి కూడా ఉండదు. సినిమా మొత్తం ప్లాట్ గా వెళ్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే సినిమా ఎక్కడో స్టార్ట్ అయి, మరెక్కడో ఎండ్ అయింది. పేపర్ మీద రాసుకున్న ఆ సీన్ల తాలూకు ఇంపాక్ట్ అనేది స్క్రీన్ మీద ప్రజెంట్ చేయలేకపోయారు…ఇక ఈ సినిమాలో అర్జున్ రెడ్డి లుక్ ను మాత్రమే కాపీ చేశారు. దానికి దీనికి పెద్దగా సంబంధం ఉండదు. ఎందుకంటే అర్జున్ రెడ్డి ఒక క్లాసికల్ ఫిల్మ్… హీరో గడ్డం, జుట్టు పెంచుకొని, నాలుగు బోల్డ్ సీన్లు ఉన్నంత మాత్రాన ప్రతి సినిమా అర్జున్ రెడ్డి అవ్వదు. అలాంటి సినిమాలు చేయాలంటే సందీప్ రెడ్డి వంగ వల్ల మాత్రమే అవుతుంది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక సిద్దార్థ్ రాయిగా చేసిన దీపక్ సరోజ్ ఇంతకుముందు ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇక ఈ సినిమాతో హీరోగా మారడం అనేది ఒక మంచి విషయం అనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో ఆయన లుక్స్ పరంగా ఓకే అనిపించినప్పటికీ, కొన్ని సీన్లల్లో మాత్రం ఆయన స్క్రిప్ట్ కి అంతగా సెట్ అవ్వలేదనిపిస్తోంది. ఆయన పలికించే ఎక్స్ ప్రెషన్స్ కూడా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి. హీరో వెంట్రుకలు, గడ్డంతో ఉన్నప్పుడు ఒకే అనిపించాడు. కానీ గడ్డం తీసేసిన తర్వాత నీట్ షేవ్ లుక్కులో మాత్రం మనం చూడలేకపోయాం…ఇక హీరోయిన్ అయిన తన్వి నేగి తన పాత్రని పర్ఫెక్ట్ గా పొట్రే చేసింది. బోల్డ్ సీన్స్ లో నటించినప్పటికీ యాక్టింగ్ పరంగా కూడా చాలా మెచ్యుర్డ్ పర్ఫామెన్స్ ఇచ్చిందనే చెప్పాలి… ఇక హీరో మరదలు పాత్రలో నటించిన నందిని ఎల్లారెడ్డి హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్ లో బాగా నటించింది. ఎప్పుడు హీరోని ప్రొటెక్ట్ చేస్తూ హీరోకి ఒక క్లోజ్ ఫ్రెండ్ లా నటించి ఆ పాత్ర లో తను మంచి అభినయాన్ని చూపించింది. ఇక హీరో ఫాదర్ క్యారెక్టర్ లో ఆనంద్ భారతి చాలా సెటిల్డ్ గా నటించాడు. ఇక వీళ్ళని మినహాయిస్తే ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ అయితే ఏమీ లేవు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన రధన్ పాటల్లో ఒక్క సాంగ్ మినహాయిస్తే మిగిలిన సాంగ్స్ ఏవి పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా కొత్తదనం ఏమి కనిపించలేదు. నార్మల్ గా వెళ్ళిపోయింది అంతే… ఇక సినిమాటోగ్రాఫర్ అయిన శ్యామ్ కె నాయుడు వర్క్ ఒకే అనిపించింది. ఇంతకుముందు ఆయన చేసిన భారీ సినిమాల్లో ఉన్న ఇంపాక్ట్ అయితే ఈ సినిమాలో కనిపించలేదు…

ప్లస్ పాయింట్స్

కథ
తన్వి నేగి (హీరోయిన్) యాక్టింగ్

మైనస్ పాయింట్స్

హీరో క్యారెక్టర్ చేసిన దీపక్ సరోజ్
క్లారిటీ లేని స్క్రీన్ ప్లే
కొన్ని లాజిక్ లేని సీన్లు
డైరెక్షన్
మ్యూజిక్

రేటింగ్

ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 1.5/5

చివరి లైన్
అర్జున్ రెడ్డి 2.0 అవుతుందనుకుంటే క్లారిటీ లేని సినిమా గా నిలిచిపోయింది…