Shubman Gill : క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. క్రికెట్ కింగ్ కోహ్లీ.. భారత క్రికెట్‌ను వీరు అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. వీళ్ల వారసుడిగా ‘ప్రిన్స్’ అంటూ అభిమానులు పిలుచుకునే క్రికెటర్ శుభ్‌మన్ గిల్. తక్కువ సమయంలోనే గుర్తింపు పొందాడు. తన ఆటతీరుతో మంచి కీర్తి గడించాడు. పరుగుల వరద పారిస్తూ అసాధారణమైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. 2023లో అతని ఆటతీరు అమోఘం. టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మూడు ఫార్మాట్లలో తన సత్తా చాటుతూ శభాష్ అనిపించుకున్నాడు. అయితే వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌లో వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొన్నాడు. వన్డేలు మినహా టీ20, టెస్ట్ మ్యాచ్‌లలో తేలిపోయాడు. మాజీ క్రికెటర్లు కూడా గిల్ ఆటతీరుపై విమర్శలు గుపి‍్పంచారు. వైజాగ్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఫస్ట్ ఇన్నింగ్‌ల్లో విఫలం కావడంతో కామెంటేటర్ రవిశాస్త్రి గిల్‌ను హెచ్చరించాడు. చివరకు జట్టులో స్థానం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కీలక ఇన్నింగ్స్‌తో..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 34 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ అతడికి పరీక్షలా మారింది. 28/0తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన గిల అద్భుతమైన బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్ ఆడాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 134 బంతుల్లో సెంచరీని సాధించాడు.
ముఖంలో కనిపించని నవ్వు..
అయితే సెంచరీ తర్వాత గిల్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో అని క్రికెట్ లవర్స్ ఎదురు చూశారు. సింహం గర్జించినట్లు బిగ్గరగా అరుస్తూ సంబరాలు చేసుకుంటాడని భావించారు. కానీ, సెంచరీ తర్వాత అలాంటి గర్జనలు ఏమీ కనబడలేదు. గిల్ ముఖంపై కనీసం చిరునవ్వు కూడా లేదు. భావోద్వేగంతో కన్నీటిని ఆపుకుంటూ ఆకాశంవైపు తలెత్తాడు. తర్వాత పార్టనర్ అక్షర్ పటేల్‌ను హత్తుకుని సాదా సీదాగా సెలబ్రేషన్స్ ముగించాడు. ఈ ఇన్నింగ్స్ గిల్ కెరీర్‌కు ఎంత ముఖ్యమలో అతడి సెలబ్రేషన్స్ తీరు చూస్తే అర్థమవుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
A determined and composed knock acknowledged by the Vizag crowd
Well played Shubman Gill
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @ShubmanGill | @IDFCFIRSTBank pic.twitter.com/9GkHZt4pzS
— BCCI (@BCCI) February 4, 2024