Shobha Shetty: బిగ్ బాస్ హౌస్ నుంచి శోభా శెట్టి 14వ వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్రాండ్ వెల్కమ్ దక్కింది. సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది శోభా శెట్టి. బిగ్ బాస్ షో లో అడుగుపెట్టి మరింత పాపులర్ అయింది. అదే సమయంలో తన వరస్ట్ బిహేవియర్ తో నెగిటివిటీ మూటగట్టుకుంది. సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలకు గురైంది.
వాస్తవానికి ఆమె నామినేషన్స్ లో ఉన్న ప్రతి సారి లీస్ట్ ఓటింగ్ వచ్చినప్పటికీ .. సేవ్ కావడం పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. శోభా శెట్టి ని కావాలనే బిగ్ బాస్ సేవ్ చేస్తూ ఫేవరిజం చూపిస్తున్నారు అంటూ విమర్శలు వినిపించాయి. ప్రేక్షకుల ఓట్లు పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారనే వాదనలు వినిపించాయి. శోభా ను సేవ్ చేయడం కోసం టాప్ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేశారు అంటూ నెటిజన్స్ బిగ్ బాస్ మీద ఫైర్ అయ్యారు.
మొత్తానికి శోభా ఫినాలేకి ముందు బిగ్ బాస్ హౌస్ కి గుడ్ బై చెప్పేసింది. బయటకు వచ్చిన శోభా కి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. ఆమె కోసం అభిమానులు వేచి చూశారు. శోభా ప్రియుడు యశ్వంత్ రెడ్డి వేదిక ఏర్పాటు చేశాడు. శోభా ఫ్రెండ్ టేస్టీ తేజ కూడా ఈ వేడుకకు హాజరయ్యాడు. ఇక వెల్కమ్ సభలో పాల్గొన్న అభిమానులకు శోభా భోజనం ఏర్పాటు చేసింది. మటన్, చికెన్ బిర్యాని తో విందు ఇచ్చింది.
అభిమానాలు కడుపునింపాలన్న శోభా శెట్టి ఆలోచనకు ప్రశంసలు దక్కుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. అసలు కప్పు కొడితే ఏ రేంజ్ లో ట్రీట్ ఇచ్చేదో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు శోభా సమాధానాలు చెప్పింది. తనకు సపోర్ట్ చేసిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పి .. ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించాలి అంతా ఆటలో భాగమే అని చెప్పుకొచ్చింది. ఇక సభ ముగిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
Svardham tho chese pani kanna, prematho pani chese vatilo neethi nijayithi untundi.pic.twitter.com/jJ1eRyNUTI#BiggBossTelugu7 #ShobhaShetty
— BiggBossTelugu7 (@TeluguBigg) December 12, 2023