https://oktelugu.com/

Shikha Swaroop : ఆ నిలువెత్తు అందాన్ని.. సో కాల్డ్ బాలీవుడ్ హీరోయిజం వద్దనుకుంది..

అవకాశాల పేరుతో పాడు పనులు చేసేందుకు కూడా వెనకా ముందు చూడటం లేదు. కానీ ఇలాంటి వాటిని ఎడమకాలితో దాన్ని.. సో కాల్డ్ బాలీవుడ్ ను కాదనుకుని శిఖా స్వరూప్ దీప శిఖలాగా ప్రజ్వరిల్లింది. తన వ్యక్తిత్వంతో ఎంతోమందికి నిలువెత్తు సమాధానంగా నిలిచింది.

Written By:
  • NARESH
  • , Updated On : March 24, 2024 / 10:35 PM IST

    Shikha Swaroop

    Follow us on

    Shikha Swaroop : ముడతలు పడ్డ షారుఖ్ ఖాన్ పఠాన్ గా నటిస్తే మనం చూడాలి. కొరియన్ డ్రామా ను కిచిడి చేసి లాల్ సింగ్ చద్దా అని తీస్తే అమీర్ ఖాన్ కు జేజేలు కొట్టాలి. రొటీన్ కథను ఏక్ థా టైగర్ పేరుతో తీస్తే మనం అహోఓహో అనాలి. అంతే.. కొత్త రక్తాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేసినా వారి సినిమాలకు థియేటర్లు దొరకకూడదు.. బాలీవుడ్ ఇంతేనా.. ఇక మారదా.. ఈ దిక్కుమాలిన హీరోయిజం ఎందుకు? నీతులు చెప్పేది కేవలం సినిమాల్లోనేనా? నిజ జీవితంలో తెరవేల్పులు ఆ నీతులను పాటించరా? అంటే ఈ ప్రశ్నలకు కాదు, లేదు, ఉండబోదు అనే సమాధానాలే వస్తాయి. ఇప్పుడు మాత్రమే కాదు 80వ దశకంలోనూ ఇలాంటి అతి హీరోయిజమే ఉండేది. అలాంటి హీరోయిజం బారిన పడి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఓ నటి తెరమరుగయింది. ఇంతకీ ఎవరు ఆమె? ఎందుకు బాలీవుడ్ హీరోలు ఆమెను కాదనుకున్నారు? ప్రస్తుతం ఆమె ఏం చేస్తున్నారు? వీటన్నింటికీ సమాధానమే ఈ కథనం.

    శిఖా స్వరూప్.. ఇప్పటి వారికి పెద్దగా తెలియకపోవచ్చు గాని.. 80 వ దశకం వారికి మాత్రం సుపరిచితమే.. 1988లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుపొందిన ఐదు అడుగుల 11 అంగుళాల ఈ అందమైన యువతి.. ఆల్ ఇండియా పిస్టల్ షూటింగ్ లో నేర్పరి కూడా. అప్పట్లో షూటింగ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకుంది. జాతీయస్థాయిలో బ్యాడ్మింటన్ కూడా ఆడింది. అలాంటి యువతి మిస్ ఇండియా పోటీల్లో కిరీటాన్ని దక్కించుకుంది. అంతకుముందే దాదాపు 400 కంటే ఎక్కువ ఫ్యాషన్ షోలలో ఆమె మెరిసింది. నిలువెత్తు అందంతో.. పోత పోసిన సుకుమారంతో రాజకుమారిలా ఉండేది శిఖాస్వరూప్. అందంగా ఉండటంతో ఆమెకు బాలీవుడ్లో అవకాశాలు త్వరగానే వచ్చాయి. 1988లో మిస్ ఇండియాగా ఎన్నికైన తర్వాత.. కొద్ది రోజులకే ఆమెకు బాలీవుడ్ స్వాగతం పలికింది. 1990లో దాదాపు 11 సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించింది. వాటిల్లో కొన్ని మల్టీ స్టార్లర్లు కూడా ఉన్నాయి. అందమే కాదు అభినయాన్ని పండించడంలో శిఖా స్వరూప్ ముందుండేది.

    పురుషాధిక్యం ఎక్కువగా ఉండే సినీ పరిశ్రమ లో శిఖా స్వరూప్ కు అడుగడుగునా ప్రతి బంధకాలు ఎదురయ్యాయి. ఏ అందం ద్వారా ఆమె మిస్ ఇండియా గెలుచుకుందో.. ఏ ఎత్తు ద్వారా అందగత్తెగా 400కు మించి ఫ్యాషన్ షోలలో పాల్గొందో..ఆ అందం, ఆ ఎత్తు ఆమెకు అవరోధంగా మారాయి. ఆమె సుకుమారాన్ని చూసి హీరోల అహం దెబ్బతిన్నది. ఫలితంగా ఆమెకు అవకాశాలు రాకుండా పోయాయి. హిందీ చిత్ర పరిశ్రమలో ఆలస్యంగారాయణ ఆడవాళ్లకు ఎదురయ్యే పరిస్థితి తెలుసుకున్న ఆమె బౌన్సింగ్ బ్యాక్ లాగా వెనక్కి వచ్చేసింది. టెలివిజన్ సీరియల్స్ వైపు దృష్టి సారించింది. అందులో ఆమెకు చంద్రకాంత అనే సీరియల్ మంచి పేరు తెచ్చి పెట్టింది.. 2012లో జి చానల్లో ప్రసారమైన రామాయణ్ అనే సీరియల్ లో కైకేయి పాత్రలో నటించింది.. 2012 తర్వాత రంగుల ప్రపంచానికి ఆమె స్వస్తి పలికింది. ప్రస్తుతం ఉపన్యాసకురాలిగా ఆమె పని చేస్తోంది. అనేక విషయాలపై అవగాహన పెంచుకొని యువతలో, మానసిక సమస్యలతో బాధపడే వారిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేస్తోంది. శిఖా స్వరూప్ 1992లో రాజీవ్ లాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనితో కలిసి అత్యంత ప్రశాంతమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతోంది.

    ఈ బాలీవుడ్ అయితే తనను వదులుకుందో.. ఆ బాలీవుడ్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఏ హీరోలైతే ఆమె అందాన్ని చూసి అసూయపడ్డారో.. అదే అందంతో చంద్రకాంత అనే సీరియల్లో నటించింది. లక్షలాదిమందిని అభిమానులుగా చేసుకుంది. ఏ ఎత్తు చూసి దర్శకులు దూరంపెట్టారో.. తనకున్న జ్ఞానం ద్వారా అంత ఎత్తుకు ఎదిగింది. అందుకే అంటారు గౌరవం లేని చోట ఉండకూడదని.. మర్యాద ఇవ్వని చోట ఆత్మాభిమానాన్ని చంపుకోవద్దని.. ఈ తరం కథానాయికలు అంగాంగ ప్రదర్శన చేయడానికి వెనుకాడటం లేదు. అసభ్యకరమైన సన్నివేశాలకూ నో చెప్పడం లేదు. అవకాశాల పేరుతో పాడు పనులు చేసేందుకు కూడా వెనకా ముందు చూడటం లేదు. కానీ ఇలాంటి వాటిని ఎడమకాలితో దాన్ని.. సో కాల్డ్ బాలీవుడ్ ను కాదనుకుని శిఖా స్వరూప్ దీప శిఖలాగా ప్రజ్వరిల్లింది. తన వ్యక్తిత్వంతో ఎంతోమందికి నిలువెత్తు సమాధానంగా నిలిచింది.