Kangana Ranaut: కంగనా రనౌత్ ఏం చేసినా ప్రత్యేకమే. ఎవరు ఏమనుకున్నా తనకేమి అన్నట్లు ఉంటుంది ఆమె వ్యవహారం. ఎప్పుడు ఎవరి పై ఫైర్ అవుదామా అన్నట్టు ఉంటుంది ఆమె ఆలోచనా విధానం. అసలు బోల్డ్ హీరోయిన్ అయినా, మరీ పచ్చిగా మాట్లాడదు ఒక్క ‘కంగనా రనౌత్’ తప్ప. ఎంత హాట్ బాంబ్ అయినా ఏదొక సందర్భంలో కాస్త అయిన సిగ్గును ప్రదర్శిస్తోంది ఒక్క ‘కంగనా రనౌత్’ తప్ప. కంగనా ఆలోచనా విధానమే కాదు, ఆమె మాటల ప్రవాహం కూడా విభిన్నమే.

ముఖ్యంగా జయలలిత బయోపిక్ లో నటించనప్పటి నుంచి కంగనాలో చాల మార్పులు వచ్చాయి. మరి జయలలిత ఆత్మ రూపంలో కంగనా ఒంటి లోకి దూరి స్ఫూర్తిని నింపిందో ఏమో కానీ, కంగనా అచ్చంగా రాజకీయ నేతలా మారిపోయింది. దీనికితోడు ఆ మధ్య ఝాన్సీ లక్ష్మీబాయి బయోపిక్ లో కూడా నటించిందయ్యే. అప్పటినుంచి తాను ఝాన్సీ లక్ష్మినే అన్నట్టుగా ఆ మధ్య చెప్పుకుని తిరిగింది.

ప్రస్తుతం ఓ వేశ్య కథలో నటిస్తోంది. అందుకే.. ఈ పాత్రలో కంగనా లీనం అయిపోయింది. ప్రస్తుతానికి తన జీవితంలోని ఘాటు సంఘటనలను ప్రపంచానికి సగర్వంగా చాటి చెబుతుంది. మరి ఆమె మాటల్లోనే.. ఆ ఘాటు గుట్టు ఏమిటో విందాం. ‘నాకు అప్పుడు ఆరేళ్ల వయసు. ఆ వయస్సులో నన్ను నా దగ్గరి బంధువులలోని ఇద్దరు నన్ను లైంగికంగా బాగా వేధించేవారు. నాకు చాక్లెట్లు కొని పెట్టేవారు. అప్పుడు చాక్లెట్లు కోసం నేను ఆ విషయాలు ఎవరికీ చెప్పేదాని కాదు.

అలా దాదాపు నాకు 11 ఏళ్లు వచ్చేవరకు వాళ్ళు నన్ను లైంగికంగా వాడుకున్నారు. ఐతే, ఒక రోజు నా బంధువు హద్దులు దాటి వెళ్ళాడు. ఇక దాన్ని అక్కడే ఆపేయాలని నాకు అర్థమైంది. అలాగే, వారిని కంట్రోల్ చేశాను కూడా. ఆ తర్వాత ఇంకో వ్యక్తి కూడా నన్ను కావాలని అనుచితంగా తాకుతూ ఆనందపడే వాడు. పైగా నన్ను పిలిచి బట్టలు విప్పమని అడిగేవాడు. నన్ను ఇష్టం వచ్చినట్టు తడుముతూ ఉండేవాడు.

నిజానికి అప్పుడు నా వయస్సు 8 మాత్రమే. అందుకే నేను అతన్ని ఆపలేక పోయేదాన్ని. దాంతో అతను తన అందాన్ని తీర్చుకునేవాడు’ అంటూ కంగనా చాలా ఎమోషనల్గా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా అందర్నీ అడ్డమైన తిట్లు తిట్టి మొత్తానికి ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది కంగనా. అసలు ఈ స్థాయిలో తిక్క ఉన్న హీరోయిన్ ఎవ్వరూ ఉండరు ఒక్క ‘కంగనా రనౌత్’ తప్ప. ఐటమ్ క్యారెక్టర్స్ తో హాట్ సమాజాన్ని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ సీఎం అవ్వాలని కలలు కనదు ఒక్క ‘కంగనా రనౌత్’ తప్ప. అందుకే ఆమె ప్రత్యేకం.

Recommended Videos: