https://oktelugu.com/

Telangana Elections Results 2023 : మంత్రుల వెనుకంజ.. ఓటమి బాటలో ఏడుగురు మినిస్టర్లు..

కౌంటింగ్‌లో తుమ్మల స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నారు. బాల్కొండలో కూడా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెనుకబడ్డారు. ఆయనపై కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. మహబూబ్‌నగర్‌లో నిరంజన్‌రెడ్డి కూడా వెనుకబడ్డారు.

Written By:
  • NARESH
  • , Updated On : December 3, 2023 1:04 pm
    Follow us on

    Telangana Elections Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలకు అనుగుణంగానే ఫలితాలు వస్తున్నాయి. దీంతో 55కుపైగా స్థానాల్లో కాంగ్రెస్‌ లీడ్‌ ప్రదర్శిస్తోంది. బీఆర్‌ఎస్‌ కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. ఇక అధికార బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రులు ఓటమి బాటలో పయనిస్తున్నారు. ఏడుగురు మంత్రులు ప్రస్తుతం వెనుకబడగా మరో నలుగురు స్వల్ప ఆధిక్యంలోనే ఉన్నారు. రౌండ్లు కొనసాగే కొద్ది ఫలితాలు మారే అవకాశం ఉంది..

    ఏడుగురు వీరే..
    ఇక తెలంగాణ ఎన్నికల్లో వెనుకబడిన నలుగురు మంత్రులు సీనియర్లే కావడం గమనార్హం. నిర్మల్‌లో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వెనుకబడ్డారు. అక్కడ బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక పాలకుర్తిలో సీనియర్‌ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు కూడా వెనుకబడ్డారు. ఇక్కడ కాంగ్రెస్‌ యువ నాయకురాలు, అతిపిన్న వవయస్కురాలు యశశ్వినిరెడ్డి ఆధిక్యం కనబరుస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కూడా వెనుకంజలో ఉన్నారు. ఆయన ఖచ్చితంగా గెలుస్తారని ఆశించారు. కానీ మూడు రౌండ్లలో వెనుకపడ్డారు. ఇక ధర్మపురిలో కొప్పులు ఈశ్వర్‌ కూడా వెనుకపడ్డారు. ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఈసారి ఓటమి బాటలో పయనిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ముందజలో ఉన్నారు. ఇక ఖమ్మంలో పువ్వాడ అజయ్‌ కూడా వెనుకబడ్డారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌రావు చాలెంజ్‌ చేసి గెలుస్తున్నారు. అజయ్‌ కూడా తనదే గెలుపని చాలెంజ్‌ చేశారు. కానీ కౌంటింగ్‌లో తుమ్మల స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నారు. బాల్కొండలో కూడా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెనుకబడ్డారు. ఆయనపై కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. మహబూబ్‌నగర్‌లో నిరంజన్‌రెడ్డి కూడా వెనుకబడ్డారు.

    మరో ఐదుగురు స్వల్ప లీడ్‌..
    ఇక మరో ఐదుగురు మంత్రులు స్వల్ప మెజారిటీతో ముందజలో ఉన్నారు. అందులో ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ ఉండడం గమనార్హం. కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌ కూడా స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. సూర్యపేటలో జగదీశ్వర్‌రెడ్డి స్వల్ప ఆధిక్యంలోనే ఉన్నారు. మహేశ్వరంలో కూడా సబితా ఇంద్రారెడ్డి కూడా స్వల్ప ఓట్లతో ముందంజలో ఉన్నారు.