https://oktelugu.com/

Aus vs WI : వేలు విరిగినా నిప్పులు చెరిగేలా బంతులు వేసి ఆస్ట్రేలియాపై విండీస్ ను గెలిపించిన వీరుడు…

ఇక ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రెండూ కూడా శమీర్ జోసఫ్ నే వరించాయి...

Written By:
  • Gopi
  • , Updated On : January 28, 2024 / 11:34 PM IST
    Follow us on

    Aus vs WI : ఆస్ట్రేలియా వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో 8 పరుగుల తేడా తో  వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేసి ఆస్ట్రేలియన్ ప్లేయర్లను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక ఇదే విధంగా వీళ్ళు మ్యాచ్ ని గెలిచి రెండు టెస్టు మ్యాచ్ లను సమం చేశారు. ఇక దీంతో వెస్టిండీస్ మరొకసారి విజయాన్ని సాధించి తమ గెలుపు బావుటను ఎగరవేసింది.

    ఇక 27 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా లో వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ గెలిచి ఒక గొప్ప విజయాన్ని అయితే సాధించింది. ఇక ఈ మ్యాచ్ మొత్తానికి శమీర్ జోసఫ్ హైలెట్ గా నిలిచాడు. తన వేలు విరిగిపోయిన కూడా మ్యాచ్ ని గెలిపించాలని ఒక అకుంటిత దీక్ష తో తను బౌలింగ్ చేస్తూ వెస్టిండీస్ టీం కి ఒక అద్భుతమైన విజయాన్ని అందించాడు…ఇక ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ లో 311 పరుగులు చేసింది.

    ఇక ఆస్ట్రేలియా 289 పరుగులు చేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ టీం 193 పరుగులు చేసింది. ఇక దాంతో 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియన్ టీం ఈజీగా ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ శమీర్ జోసఫ్ బౌలింగ్ దాటికి ఆస్ట్రేలియన్ ప్లేయర్లందరు చేతులెత్తేశారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు.

    68 పరుగులు ఇచ్చిన శమీర్ జోసఫ్ 7 వికెట్లు తీశాడు. ఇక స్టీవ్ స్మిత్ 91 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసి నాటౌట్ గా నిలిచిప్పటికీ ఆయనకి సపోర్ట్ చేసే మరో ప్లేయర్ లేకపోవడంతో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ ని ఓడిపోయింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 207 పరుగులకి ఆల్ అవుట్ అవ్వడంతో, వెస్టిండీస్ 8 పరుగులు తేడాతో విజయాన్ని సాధించింది.

    ఇక వెస్టిండీస్ ఈ గెలుపుతో కరేబియన్ దీవుల్లో పండగ వాతావరణం నెలకొంది. శమీర్ జోసఫ్ మొదటి టెస్ట్ లో ఐదు వికెట్లు తీశాడు. రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీయగా, సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం 7 వికెట్లు తీసి తన సత్తాను చాటుకున్నాడు… ఇక ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రెండూ కూడా శమీర్ జోసఫ్ నే వరించాయి…