Munugode Bypolls: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైనందున కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన సీటును తాను దక్కించుకోవడానికి రెడీ అయ్యింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోమటిరె్డి వెంకటరెడ్డి, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలతో ఓ కమిటీ వేసి వారు మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాల్సిందిగా బాధ్యతలు అప్పగించింది.

అయితే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు వెంకటరెడ్డి తన సోదరుడి ఓటమికి పాటుపడతారా అనేది అందరిలోనూ సందేహం కలిగింది. కాంగ్రెస్ లో ఉన్న అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తన తమ్ముడు బీజేపీలో ఉంటే ఓడిస్తాడా? అన్నది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కు నల్గొండలో గట్టి పట్టుంది. గెలిపించుకునే కెపాసిటీ ఉంది. వెంకటరెడ్డి ఇప్పుడు మునుగోడులో కాంగ్రెస్ గెలుపును శాసించగలడు. కానీ తన తమ్ముడికి వ్యతిరేకంగా వెళతాడా? లేదా? అన్నదే డౌట్.
ఆ అనుమానమే నిజమైంది. బుధవారం నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండిలో గ్రామస్థాయి కార్యకర్తల సమావేశంలో సంచలన విషయం లీక్ అయ్యింది.. ఈ కార్యక్రమానికి మండల ఇన్ చార్జి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణరావు హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడిన ఎంపీటీసీ సభ్యురాలు పోలగోని విజయలక్ష్మి భర్త సైదులు సంచలన ఆరోపణలు చేశారు.తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డినే గెలిపించాలని.. వెంకటరెడ్డి పదేపదే వాట్సాప్ కాల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. మండలంలోని చాలా మంది కాంగ్రెస్ నేతలకు ఆయన ఫోన్ చేస్తున్నారని.. కానీ బయటకు చెప్పేందుకు వారు ధైర్యంచేయడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి.
దీంతో వెంకటరెడ్డి బండారం బయటపడినట్టైంది. నిజంగానే వెంకటరెడ్డి ఫోన్ కాల్స్ చేస్తున్నాడా? బీజేపీలోని తమ్ముడిని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారా? అదే నిజమైతే ఆయనపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలకు రంగం సిద్దం చేస్తుందన్న ప్రచారం సాగుతోంది.
[…] […]