https://oktelugu.com/

ఆరోగ్య భీమా పాలసీ తీసుకుంటున్నారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..?

కరోనా విజృంభణ తరువాత సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు సైతం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దేశంలో రోజురోజుకు ఆరోగ్య పాలసీలకు ప్రాధాన్యత పెరుగుతోంది. అయితే ఆరోగ్య పాలసీలను తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. వయస్సు పెరుగుతున్న కొద్దీ విలువ పెరిగే పాలసీలను ఎక్కువగా తీసుకోవాలి. ఆన్ లైన్ లో కూడా ఆరోగ్య పాలసీని సులభంగా తీసుకోవచ్చు. Also Read: వెలుగులోకి కొత్తరకం మోసం.. సిమ్ బ్లాక్ అంటూ లక్షల్లో మాయం..? 30 సంవత్సరాల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 19, 2021 / 03:14 PM IST
    Follow us on

    కరోనా విజృంభణ తరువాత సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు సైతం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దేశంలో రోజురోజుకు ఆరోగ్య పాలసీలకు ప్రాధాన్యత పెరుగుతోంది. అయితే ఆరోగ్య పాలసీలను తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. వయస్సు పెరుగుతున్న కొద్దీ విలువ పెరిగే పాలసీలను ఎక్కువగా తీసుకోవాలి. ఆన్ లైన్ లో కూడా ఆరోగ్య పాలసీని సులభంగా తీసుకోవచ్చు.

    Also Read: వెలుగులోకి కొత్తరకం మోసం.. సిమ్ బ్లాక్ అంటూ లక్షల్లో మాయం..?

    30 సంవత్సరాల వయస్సు పైబడిన వారు ఆరోగ్య పాలసీని తప్పనిసరిగా తీసుకుంటే మంచిది. తమతో పాటు, కుటుంబానికి రక్షణ కల్పించే పాలసీని తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయి. రోజురోజుకు వైద్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఆర్థిక రక్షణ లభించే బీమా పాలసీని తీసుకుంటే మంచిది. దీర్ఘకాలిక వ్యాధులకు పరిహారం చెల్లించే పాలసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి.

    Also Read: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే అంతే సంగతులు..?

    పాలసీని క్లెయిమ్ చేసుకునే సమయంలో అదనపు ప్రీమియం వసూలు చేయని పాలసీలను, వేచి ఉండే వ్యవధి తక్కువగా ఉండే పాలసీలను తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయి. 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారిని అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. మిగతా వారితో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు పూర్తిస్థాయిలో ప్రయోజనాలను చేకూర్చే ఆరోగ్య బీమా పాలసీలు ఎక్కువగా ఉండవు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    సీనియర్ సిటిజన్లు ఆరోగ్య పాలసీ తీసుకోవాలనుకుంటే ఒకటికి రెండుసార్లు అన్నీ పరిశీలించి పాలసీ తీసుకుంటే మంచిది. చాలామంది తాము సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని భావించి ఆరోగ్య బీమా పాలసీలను తీసుకోవడానికి ఆసక్తి చూపరు. అలా చేయడం వల్ల ప్రమాదం జరిగినా ఏదైనా అనారోగ్యం వచ్చినా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.