https://oktelugu.com/

Coimbatore bomb blast : కోయంబత్తూరు పేలుళ్ల నేరస్థులకు మద్దతుగా కుహనా సెక్యులర్ పార్టీలు:

ఇలాంటి సమాజం ఉన్న పరిస్థితుల్లో కోయంబత్తూరు పేలుళ్ల నేరస్థులకు మద్దతుగా కుహనా సెక్యులర్ పార్టీల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు. 

Written By:
  • NARESH
  • , Updated On : October 11, 2023 5:39 pm

    Coimbatore bomb blast : కోయంబత్తూరు పేలుళ్లు.. 1998 ఫిబ్రవరిలో జరిగినవి ఎంత మందికి గుర్తుందో తెలియదు కానీ.. అదో ఘోరకలి. జనసమూహం మధ్య బాంబు పేల్చి 58 మందిని చంపేశారు. 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ రాడికల్ ఉగ్రవాద సంస్థ చేసిన ఈ పాపం ఇప్పటికీ ఎవ్వరూ మరిచిపోలేదు. ఈ ఉగ్రవాదులను పట్టుకున్నారు. శిక్ష పడింది. కొత్తమందికి ఉరి, మరికొంతమందికి యవజ్జీవ శిక్ష పడింది. మొత్తం 36 మంది ఈ శిక్ష పడ్డవారు ఇప్పటికీ జైల్లో ఉన్నారు.

    ఇవ్వాళ ఎందుకు దీని గురించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. అసలు మన దేశం ఎటుపోతోంది. నిన్నటికి నిన్న హమాస్ ఇజ్రాయిల్ బోర్డర్ దాటి వచ్చి మరీ అక్కడి ప్రజలను దారుణంగా చంపేశారు. 70 మంది పసిపిల్లలను చంపేశారు. దీన్ని భారతదేశం ఘోరంగా ఖండించింది. అయితేమన దేశంలోనూ హమాస్ చర్యలను ఖండించని పార్టీలున్నాయి. నిన్నటికి నిన్న శ్రీలంక-పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే.. జీతేగా జీతేగా పాకిస్తాన్ జీతేగా అంటూ ఇక్కడి ప్రజలు నినాదాలు చేయడం చూస్తే ఈ సమాజం ఎటుపోతోందో అర్థం కావడం లేదు.

    ఇలాంటి సమాజం ఉన్న పరిస్థితుల్లో కోయంబత్తూరు పేలుళ్ల నేరస్థులకు మద్దతుగా కుహనా సెక్యులర్ పార్టీల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు. 

    కోయంబత్తూరు పేలుళ్ల నేరస్థులకు మద్దతుగా కుహనా సెక్యులర్ పార్టీలు || Coimbatore || Ram Talk