https://oktelugu.com/

Science News : 46 వేల వయసున్న ఆ పురుగుని బ్రతికించారు… అది ఏకంగా పిల్లల్ని కనడం మొదలెట్టింది!

ఇలా సైబీరియా మంచు కింద 46వేల ఏళ్లనాటి ఒక పురుగును గుర్తించడమే పెద్ద సంచలనంగా మారింది. నాటి పరిస్థితులు, వాటి జీవనశైలిని.. నాటి కాలం నాటి పరిస్థితులను అవగతం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన వనరుగా ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

Written By:
  • NARESH
  • , Updated On : July 30, 2023 10:30 am
    Follow us on

    Science News : ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 46వేల ఏళ్ల క్రితం నాటి పురుగు.. క్రీస్తుకు పూర్వం వాటిని గుర్తిస్తేనే మనో అబ్బురపడుతాం.. కానీ ఎప్పుడూ దట్టమైన మంచుతో కప్పబడి ఉండే సైబీరియాలోని ప్రాంతం అది. అక్కడ 40 మీటర్ల కింద మంచుతో ఘనీభవించి చెడుపోకుండా ఉన్న 46వేల ఏళ్లని ఒక పురుగును శాస్త్రవేత్తలు గుర్తించారు. దాన్ని పరిశోధించి చూడగా ఎన్నో నిజాలు వెలుగుచూశాయి.

    46,000 సంవత్సరాల క్రితం సైబీరియన్ పెర్మాఫ్రాస్ట్‌ మంచు ప్రాంతంలో ఘనీభవించిన ఇంతవరకూ గుర్తించని రౌండ్‌వార్మ్ జాతికి చెందిన పురుగును జర్మనీలోని శాస్త్రవేత్తల బృందం పునరుద్ధరించింది. అది ఏకంగా పిల్లల్ని కనడం కూడా మొదలుపెట్టింది. ఇదో అద్భుతంగా చెప్పొచ్చు. క్రిప్టోబయోసిస్ అని పిలువబడే నిద్రాణమైన స్థితిలో ఉన్న ఈ పురుగును గుర్తించారు. శాశ్వతంగా మంచుతో కప్పబడిన ఉపరితలం నుండి 40 మీటర్ల దిగువన రౌండ్‌వార్మ్ బయటపడిందని తెలిపారు.

    క్రిప్టోబయోటిక్ స్థితిలో ఉన్న జీవులు పూర్తిగా నీరు లేదా ఆక్సిజన్ లేకున్నా తట్టుకోగలవు. అధిక ఉష్ణోగ్రతలు, అలాగే గడ్డకట్టే చలి లేదా చాలా ఉప్పగా ఉండే పరిస్థితులను తట్టుకోగలవు. “మరణించకుండా.. జీవించినట్టు కాకుండా మధ్యలో నిద్రాణ స్థితిలో ఉంటాయి. దీనిలో వారి జీవక్రియ రేట్లు గుర్తించలేని స్థాయికి తగ్గుతాయి.

    ఈ జాతి పురుగులు జీవితాన్ని ఆపివేయవచ్చు. లేదంటే దానిని మొదటి నుండి ప్రారంభించవచ్చు అని కుర్జ్‌చాలియా అనే సైంటిస్ట్ చెప్పారు, ఈ స్థితి నుండి గతంలో పునరుద్ధరించబడిన జీవులు సహస్రాబ్దాలుగా కాకుండా దశాబ్దాలుగా మనుగడ సాగించాయి.

    ఐదేళ్ల క్రితం, రష్యాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికోకెమికల్ అండ్ బయోలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ సాయిల్ సైన్స్ శాస్త్రవేత్తలు సైబీరియన్‌లో రెండు రౌండ్‌వార్మ్ జాతులను కనుగొన్నారు. తదుపరి విశ్లేషణ కోసం జర్మనీలోని ల్యాబ్‌లకు దాదాపు 100 పురుగులను తీసుకెళ్లారు. ఇన్‌స్టిట్యూట్‌లోని రెండు పురుగులను నీటితో రీహైడ్రేట్ చేయడం ద్వారా పునరుద్ధరించారు.

    45,839 -47,769 సంవత్సరాల క్రితం నాటివి అని ఈ పురుగులను నిర్ధారించడానికి వాటిపై ఉన్న నిక్షేపాల వయసును లెక్కించారు. పురుగుల జన్యు విశ్లేషణ చేశారు. దీంతో ఇవి అప్పటి జాతికి చెందినవని తేలింది. దీనిని పరిశోధకులు ‘పానాగ్రోలైమస్ కోలిమెనిస్’ అని పిలుస్తారు.

    శాస్త్రీయ అధ్యయనాలలో ఉపయోగించే మరొక జీవి – క్రిప్టోబయోసిస్‌ ఇది మనుగడ సాగించడానికి ట్రెహలోస్ అనే చక్కెరను ఉత్పత్తి చేస్తాయి. అవి గడ్డకట్టినా.. నిర్జలీకరణాన్ని తట్టుకొని కొన్ని ఏళ్లు నిద్రాణ వ్యవస్థలో ఉండగలవు..

    ఇలా సైబీరియా మంచు కింద 46వేల ఏళ్లనాటి ఒక పురుగును గుర్తించడమే పెద్ద సంచలనంగా మారింది. నాటి పరిస్థితులు, వాటి జీవనశైలిని.. నాటి కాలం నాటి పరిస్థితులను అవగతం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన వనరుగా ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.