https://oktelugu.com/

Amazon: అమెజాన్ అంటే అనకొండలు మాత్రమే కాదు.. అంతకుమించిన పాములున్నాయి అక్కడ

యునైటెడ్ కింగ్డమ్ నాచురల్ హిస్టరీ మ్యూజియం వెల్లడించిన సమాచారం ప్రకారం గ్రీన్ ఆనకొండలు ప్రపంచంలోనే అత్యంత బరువైన పాములు." 225 కిలోల బరువు, 27.7 అడుగుల పొడవు, 3.6 అడుగుల వెడల్పుతో పాములున్నాయని" శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 24, 2024 9:18 am
    Amazon
    Follow us on

    Amazon: అమెజాన్.. ఈ పేరు వింటే చాలు అనకొండ లే గుర్తుకొస్తాయి. సినిమాల ప్రభావం, మరేమిటో తెలియదు గాని అమెజాన్ అంటే చాలు చాలామందిలో అనకొండలకు అత్యంత అనువైన ప్రాంతమని స్థిరపడిపోయింది. అమెజాన్ అంటే కేవలం ఆ పెద్ద పాముకు మాత్రమే అనువైన స్థలమా? ఇక వేరే కొత్త జాతులు అక్కడ లేవా? ఈ విషయాలు కనుగొనేందుకు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేశారు. ఇందులో భాగంగా కొత్త జాతికి చెందిన పామును కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్దదనే పుకార్లు వినిపిస్తున్నాయి. క్వీన్స్ ల్యాండ్ విశ్వవిద్యాలయం నుంచి ఒక బృందం ఈక్వెడార్ లోని అమెజాన్ అటవీ ప్రాంతానికి వెళ్ళింది. ఇప్పటినుంచి “ఉత్తర ఆకుపచ్చ అనకొండ” (యూనె క్టెస్ అకాయిమా) అన్వేషణ కోసం వెళ్ళింది. వరకు ఈ పామును ఎవరూ కనుగొనలేదు. వోరానీ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు తాము ఈ పరిశీలనకు వచ్చామని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

    ప్రొఫెసర్ బ్రయాన్ ఫ్రై ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం పది రోజులపాటు
    బమెనో ప్రాంతానికి చెందిన వేటగాళ్లతో కలిసి “బైహు యేరి వొరాని” లో పరిశీలించింది. ఈ సమయంలో కొన్ని నిర్మానుష్యమైన ప్రాంతాల్లో ఆహారం కోసం వేచి చూస్తున్న అనకొండలను శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది.” అది అద్భుతమైన జీవుల సమూహం. మేము చూసిన ఆకుపచ్చ అనకొండల్లో ఒక ఆడ పాము పొడవు 6.3 మీటర్లు అంటే సుమారుగా 20.7 అడుగులు.. దాన్ని అలా చూడడం మాకు ఆశ్చర్యం అనిపించింది. అరుదైన అనకొండల పాముల గురించి త్వరలో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ లో “పోల్ టు పోల్ విత్ విల్” సిరీస్ లో ప్రసారమవుతుంది. ఈ ప్రాంతంలో 7.5 మీటర్లు అంటే 24.6 అడుగుల పొడవు, 1100 పౌండ్ల బరువు ఉన్న పాములు కూడా కనిపించాయని” శాస్త్రవేత్తల బృందం ప్రకటించింది.

    యునైటెడ్ కింగ్డమ్ నాచురల్ హిస్టరీ మ్యూజియం వెల్లడించిన సమాచారం ప్రకారం గ్రీన్ ఆనకొండలు ప్రపంచంలోనే అత్యంత బరువైన పాములు.” 225 కిలోల బరువు, 27.7 అడుగుల పొడవు, 3.6 అడుగుల వెడల్పుతో పాములున్నాయని” శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. గ్రీన్ ఆనకొండలు అది మిలియన్ సంవత్సరాల క్రితం దక్షిణ ప్రాంతపు అనకొండల నుంచి వేరు పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు జాతుల్లో జన్యుపరంగా 5.5% తేడాతో ఉన్నాయని శాస్త్రవేత్తలు తమ పరిశీలనలో కనుగొన్నారు. “మనుషులు చింపాంజీలతో పోల్చితే రెండు శాతం మాత్రమే భిన్నంగా ఉంటారు. ఈ పాముల్లో అయితే అది 5.5% గా ఉంది” అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఇక ఇదే జాతిలో రెడిక్యులేటెడ్ పైథాన్ అనే పాము 20.5 అడుగుల పొడవు ఉంటుంది. కాకపోతే ఇది తేలికగా ఉంటుంది.

    కేవలం ఈ పాముల గురించి మాత్రమే కాకుండా అమెజాన్ మనుషుల నుంచి ఎదుర్కొంటున్న ముప్పు గురించి కూడా ఈ శాస్త్రవేత్తల బృందం కీలక విషయాలు వెల్లడించింది. వ్యవసాయ విస్తరణ వల్ల అమెజాన్ బేసిన్ 20 నుంచి 30 శాతం వరకు కుంచించుకుపోయింది. 2050 నాటికి అమెజాన్ అడవుల సమూహంలో ఇది 40 శాతం వరకు ప్రభావితం కావచ్చని తెలుస్తోంది. అడవుల క్షీణత, అకారణంగా మంటలు చెలరేగడం, కరువు, వాతావరణంలో మార్పులు వంటివి అమెజాన్ అడవిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని శాస్త్రవేత్తల బృందం చెబుతోంది.