Sankranti Movies 2024: సంక్రాంతి సినిమాలు వచ్చేశాయి…అసలైన విన్నర్ ఎవరో తెలిసా..?

మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమా డివైడ్ టాక్ తెచ్చుకొని ఫ్లాప్ కి చాలా దగ్గరగా వెళుతుంది. ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమాని చాలా థియేటర్ లో నుంచి తీసేసి వేరే సినిమాలను వేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : January 14, 2024 2:48 pm

Sankranti 2024 Movies

Follow us on

Sankranti Movies 2024: ఈ సంక్రాంతి సీజన్ కి రిలీజ్ అయిన నాలుగు సినిమాలు కూడా ఇప్పటికే మంచి పేరు సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక వీటన్నింటిలో సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకున్న సినిమా ఏది, ఈ సంక్రాంతికి ఏ సినిమా విజయం సాధించింది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం…

మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమా డివైడ్ టాక్ తెచ్చుకొని ఫ్లాప్ కి చాలా దగ్గరగా వెళుతుంది. ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమాని చాలా థియేటర్ లో నుంచి తీసేసి వేరే సినిమాలను వేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి…

ఇక జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన మరొక సినిమా హనుమాన్ ఈ సినిమా ప్రేక్షకులను అందరిని కూడా విపరీతంగా అలరిస్తుంది. సూపర్ మాన్ అంటే హాలీవుడ్ సినిమాల్లోనే కాదు మనకు కూడా మన దేవుడు అయిన హనుమాన్ సూపర్ హీరోనే అనేది జనాలకి గుర్తుచేస్తూ నెక్స్ట్ లెవెల్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాని తీసి చూపించడం అనేది నిజం గా చాలా ఆనందాన్ని కలిగించే విషయం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి మొదటి రోజు చాలా తక్కువ థియేటర్లు ఇచ్చినప్పటికీ రోజురోజుకీ ఆ సినిమా థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తుంది. ఇక అలాగే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకొని భారీ వసూళ్లను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది…

ఇక నిన్న రిలీజ్ అయిన వెంకటేష్ హీరోగా వచ్చిన సైంధవ్ సినిమా పరిస్థితి కూడా నార్మల్ గానే ఉంది. ఇక ఈ సినిమా యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఇక ఇప్పుడున్న పరిస్థితిలో ఈ సినిమా హిట్ అయ్యే ప్రసక్తే అసలు లేదు…

ఇక నాగార్జున హీరోగా వచ్చిన నా సామిరంగ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కూడా మొదటి షో తోనే యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది.

ఇలా ఈ సంక్రాంతి కి 4 సినిమాలు రిలీజ్ అయినప్పటికీ వాటిలో హనుమాన్ సినిమా సూపర్ సక్సెస్ సాధించి బ్లాక్ బస్టర్ దిశగా ముందుకు దూసుకెళ్తుంది. ఈ సంక్రాంతి రేసు లో ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నప్పటికీ వాళ్ళందరిని ఢీ కొట్టి ఒక యంగ్ హీరో ఈ సంక్రాంతికి విన్నర్ గా నిలవడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమనే చెప్పాలి… స్టార్ హీరోలు ఉన్న లేకపోయిన కంటెంట్ లో బలం ఉంటే సినిమా నిలబడుతుంది అని తెలుగు జనాలు సైతం మరొకసారి హనుమాన్ సినిమా విషయంలో ప్రూవ్ చేసి చూపించారు…