https://oktelugu.com/

Sankranti 2024 Movies: సంక్రాంతి ఫైట్ : గుంటూరు కారం టాప్.. సైంధవ్ లాస్ట్

దిల్ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ మ్యాన్ మొదట్లోనే రేసు నుండి తప్పుకుంది. అనేక చర్చల అనంతర ఈగిల్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సినిమా విడుదల వాయిదా వేసుకునేందుకు అంగీకరించారు.

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2024 / 06:07 PM IST

    Sankranti 2024 Movies

    Follow us on

    Sankranti 2024 Movies: సంక్రాంతి సీజన్ సినిమా వాళ్లకు గోల్డెన్ పీరియడ్. టాక్ తో సంబంధం లేకుండా కాసులు కురిపించే కాలం. ఇక హిట్ టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ బద్దలే. అందుకే ఏడాది ముందే సంక్రాంతికి రావాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో ఐదారు సినిమాలు నిలుస్తాయి. అందుకే ప్రతిసారీ థియేటర్స్ సమస్య ఎదురవుతుంది. 2024 సంక్రాంతికి రావాలని గుంటూరు కారం, ఈగిల్, ఫ్యామిలీ మ్యాన్, హనుమాన్, నా సామిరంగ, సైంధవ్ చిత్రాల నిర్మాతలు ప్లాన్ చేశారు.

    అయితే దిల్ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ మ్యాన్ మొదట్లోనే రేసు నుండి తప్పుకుంది. అనేక చర్చల అనంతర ఈగిల్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సినిమా విడుదల వాయిదా వేసుకునేందుకు అంగీకరించారు. హనుమాన్ చిత్రాన్ని కూడా తప్పించాలని చూశారు. ఆ చిత్ర నిర్మాతలు వినలేదు. అందుకే తక్కువ థియేటర్స్ కేటాయించారు.

    కాబట్టి సంక్రాంతి కానుకగా గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ విడుదలవుతున్నాయి. 12న గుంటూరు కారం, హనుమాన్ విడుదలవుతుండగా 13న సైంధవ్, 14న నా సామిరంగ థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఈ సంక్రాంతి చిత్రాల నిడివి పరిశీలిస్తే… అత్యధిక డ్యూరేషన్ గుంటూరు కారం కలిగి ఉంది. ఈ చిత్ర నిడివి 2 గంటల 39 నిమిషాలు. తర్వాత హనుమాన్ నిడివి ఎక్కువ కలిగిన సినిమా. హనుమాన్ చిత్ర నిడివి 2 గంటల 38 నిమిషాలు.

    ఇక నాగార్జున నటించిన విలేజ్ పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామా నా సామిరంగ నిడివి 2 గంటల 26 నిమిషాలు. చివరిగా సైంధవ్ చిత్ర నిడివి కేవలం 2 గంటల 20 నిమిషాలు మాత్రమే. ఈ మధ్య స్టార్ హీరోల చిత్రాలు 3 గంటలకు తగ్గకుండా ఉంటున్నాయి. రన్బీర్ కపూర్ హీరోగా విడుదలైన యానిమల్ చిత్ర నిడివి దాదాపు మూడున్నర గంటలు. అంటే ఈ సంక్రాంతి చిత్రాలకంటే ఒక గంట అదనం అన్నమాట. అదన్నమాట సంగతి.