https://oktelugu.com/

Ram Charan Naatu Naatu : రామ్ చరణ్ .. ఖాన్ త్రయం నాటు స్టెప్పులు.. వైరల్ వీడియో

అప్పటికి వేదిక కింద రామ్ చరణ్ ఉండటంతో.. అతడిని కూడా పైకి పిలిచింది. దాంతో ఆ నలుగురు నాటునాటు పాటకు డాన్స్ వేసి సభికులను అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : March 3, 2024 8:50 pm
    Follow us on

    Ram Charan Naatu Naatu : ముఖేష్ అంబానీ .. తన చిన్న కొడుకు అనంత్ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలు అంబరాన్ని అంటే విధంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ స్థాయి వ్యాపారులతో, సినీ నటులు, క్రీడాకారులతో జామ్ నగర్ ప్రాంతాన్ని సందడిగా మార్చారు. ఈ వేడుకలో అతిరథ మహారధులు ఉత్సాహంగా గడుపుతున్నారు. పాటలకు లయబద్ధంగా స్టెప్పులు వేస్తున్నారు. ఆ జాబితాలో ముకేశ్ అంబానీ దంపతులు కూడా ఉన్నారు. అమెరికా పాప్ గాయని రిహన్నా పాడిన పాటలు.. ఆమె బృందం వేసిన డ్యాన్సులు ఈ మూడు రోజుల వేడుకను మరో స్థాయికి తీసుకెళ్లాయి. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

    శనివారం జరిగిన దాండియా వేడుకలో మెగా హీరో రామ్ చరణ్ తేజ్, టీమిండియా మాజీ కెప్టెన్ ధోని సందడి చేశారు. దాండియా ఆడి ఆ వేదికను ఉత్తేజపరిచారు. ఈ క్రమంలో సాయంత్రం జరిగిన వేడుకల్లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ డ్యాన్సులు వేశారు. వారి సినిమాల్లో పాటలకు లయబద్ధంగా స్టెప్పులు వేశారు. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న నాటు నాటు పాటకు ఖాన్ త్రయం డ్యాన్స్ వేసింది. అప్పటికి వేదిక కింద రామ్ చరణ్ ఉండటంతో.. అతడిని కూడా పైకి పిలిచింది. దాంతో ఆ నలుగురు నాటునాటు పాటకు డాన్స్ వేసి సభికులను అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది.

    వీరి డ్యాన్స్ కు ముందు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, తనకు కాబోయే భార్య రాధికా మర్చంట్ తో కలిసి వేదికపైకి ఎక్కాడు. తన ప్రయాణాన్ని సభికులతో పంచుకున్నాడు. తన జీవితం పూల పాన్పు కాదని, తాను కూడా ఎన్నో కష్టాలు పడ్డానని, ఈ సుదీర్ఘ ప్రయాణంలో తన తల్లిదండ్రులు ఎంతో అండగా నిలిచారని పేర్కొన్నాడు. అతడు మాట్లాడుతున్నంత సేపు ముఖేష్ అంబానీ కన్నీటి పర్యంతమయ్యాడు. చివరిగా రాధికతో తాను పీకల్లోతు ప్రేమలో ఉన్నానని.. ప్రతిరోజు ఆమెతో ప్రేమలో పడుతున్నానని పేర్కొన్నాడు. అతడు అన్న ఆ మాటలకు రాధిక ముసిముసి నవ్వులు నవ్వింది.. ఇక చివరి రోజు వేడుకల్లో సంబరాలు తారాస్థాయికి చేరాయని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.