Sajad Ahmad Bazaz : కాశ్మీర్ లో బ్యాంక్ చీఫ్ మేనేజర్ పాకిస్తాన్ గూఢచారి

కాశ్మీర్ లోని పాకిస్తాన్ గూఢచారులను ప్రభుత్వం ఏరివేస్తోంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియో లో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : August 22, 2023 3:36 pm

Sajad Ahmad Bazaz : ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ అనుకూల ఉగ్రవాద ఎకో సిస్టంను ఏరిపారేస్తున్నారు. కలుగులోంచి ఎలుకలను బయటకు తీసినట్టుగా ఈ కశ్మీర్ లోని పాకిస్తాన్ కు సాయం చేసేవారి ఆట కట్టిస్తున్నారు. ఎంతో మంది టెర్రరిస్టులు చనిపోతున్నారు. అయినా టెర్రరిజం ఎందుకు ఇంకా కొనసాగుతోందని ఆలోచిస్తే.. ఇది టెర్రరిస్టం ఎకో సిస్టంను ఉగ్రవాదులు కశ్మీర్ ప్రభుత్వంలోనే నిర్మించుకున్నారు. అందులో ముఖ్యమైనది.. ప్రభుత్వం యంత్రాంగం, ఇతర ప్రభుత్వ వ్యవస్థల్లోకి ఈ ఉగ్రవాద సానుభూతిపరులను చొప్పించారు. వీరు డైరెక్టుగా ఉగ్రవాదులుగా పనిచేయరు.. వీళ్లు వెన్నుదన్నుగా ఉండి.. సానుకూల వాతావరణాన్ని సృష్టించేది వీళ్లే.

దీన్ని గుర్తించిన బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి.. గవర్నర్ గా మనోజ్ సిన్హా వచ్చిన తర్వాత గత సంవత్సరం నుంచి బాగా దృష్టి చేశారు. 1989-90లో వేర్పాటు ఉద్యమం తర్వాత ఉగ్రవాదులకు చాలా వెసులుబాట్లు కల్పించారు. దీంతో ఉగ్రవాద సానుభూతిపరులను ప్రభుత్వ యంత్రాంగం.. విశ్వవిద్యాలయాలు, మీడియా రంగాల్లోకి పాక్ అనుకూల సానుభూతిపరులు చొప్పించబడ్డారు. వీరే టెర్రరిజానికి వెన్నుదన్నుగా నిలుస్తూ అన్ని అవసరాలు తీరుస్తున్నారు. ప్రభుత్వ లీకులను చేరవేస్తున్నారు. వాళ్లు ఇవ్వాలా టెర్రరిజం ఉద్యమాన్ని చల్లార్చకుండా చేస్తోందే ఈ పాక్ అనుకూలవాదులు. ప్రభుత్వ ఉద్యోగులుగా వీరు చలామణీ అవుతున్నారు.

గత ఏడాదిగా 60 మంది ప్రభుత్వ ఉద్యోగులని గుర్తించి డిస్మస్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ మీడియా ఇన్ చార్జి అస్లామ్ ను డిస్మస్ చేశారు. రెండు మూడు రోజులుగా ఒక ముఖ్యమైన వ్యక్తిని డిస్మస్ చేశారు. ‘జమ్మూ కశ్మీర్ ’ బ్యాంక్ చీఫ్ మేనేజర్ గా ఉన్నారు. ఈయనే ఎడిటర్ గా ఉన్నారు. ఆగస్టు 31న రిటైర్ అయ్యే ఈయను డిస్మస్ చేశారు. ఈయన ఐఎస్ఐ ప్లాంట్ చేసిన గూఢచారిగా తేలింది.

కాశ్మీర్ లోని పాకిస్తాన్ గూఢచారులను ప్రభుత్వం ఏరివేస్తోంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియో లో చూడొచ్చు.