Rohit vs Sachin : ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ చాలా రికార్డులకు చేరువయ్యారు. 244 వన్డేలలో 9837 రన్స్ తో 10వేల పరుగుల మైలురాయికి దగ్గరయ్యారు. 10వేల పరుగులు పూర్తి చేస్తే వన్డేల్లో వేగంగా ఈ మైలురాయి అందుకున్న రెండో క్రికెటర్ గా రోహిత్ నిలుస్తారు.
ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. మాస్టర్ బ్లాస్టర్ 259 ఇన్నింగ్స్ లలో 10వేల పరుగులు వన్డేల్లో పూర్తి చేశాడు. అయితే ఈ రికార్డును గతంలో విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. కేవలం 205 వన్డేల్లోనే విరాట్ కోహ్లీ 10వేల పరుగులు పూర్తి చేయడం విశేషం. సచిన్ ను విరాట్ అధిగమించేశాడు. ఈ రకంగానూ సచిన్ టెండూల్కర్ పేరిట రెండో వేగంగా 10వేల రికార్డును తాజాగా రోహిత్ శర్మ అధిగమించబోతున్నాడు.
2021లో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రోహిత్ అతడి కెప్టెన్సీల్లో వన్డేల్లో అత్యధిక విజయాలు అందుకుంది. మొత్తం 27 వన్డేల్లో కెప్టెన్ గా చేసిన రోహిత్ ఏకంగా 20 విజయాలు సాధించి పెట్టాడు. అయితే ఆటగాడిగా సెంచరీలు చేసిన సచిన్ కెప్టెన్ గా మాత్రం అంత సక్సెస్ కాలేదు. అతడి కెప్టెన్సీలో టీమిండియా 73 మ్యాచుల్లో కేవలం 23 వన్డేల్లో మాత్రమే విజయం సాధించింది. కెప్టెన్ గా మాత్రం సచిన్ టీంను సరిగ్గా నడిపించలేకపోయాడన్న అపప్రదను మూటగట్టుకున్నాడు. ఆటగాడిగా అద్భుతంగా రాణించినా ఈ విషయంలో విఫలమయ్యాడు.
అత్యధికంగా ఆసియాకప్ లలో 22 మ్యాచులు ఆడిన ఘనత మన రోహిత్ దే. 2008 నుంచి ఇప్పటివరకూ ఈ మ్యాచులు ఆడాడు. తాజా ఆసియాకప్ తో దీన్ని అధిగమించబోతున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు కూడా సచిన్ పేరిటనే ఉంది. సచిన్ 1990 నుంచి 2012 వరకూ 23 మ్యాచ్ లతో తొలి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుత ఆసియాకప్ తో రోహిత్ దీన్ని అధిగమించబోతున్నాడు.
ఇంగ్లండ్ వంటి టఫ్ కండీషన్స్ లో రోహిత్ శర్మ 2019 వన్డే వరల్డ్ కప్ లో వరుసగా 5 సెంచరీలు కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2015 వరల్డ్ కప్ లో కూడా రోహిత్ సెంచరీ బాదాడు. మొత్తం వరల్డ్ కప్ లలో 6 సెంచరీలు కొట్టాడు.
ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ లలో అత్యధిక సెంచరీలు చేసిన వారి జాబితాలో రోహిత్-సచిన్ టాప్ ప్లేసులో ఉన్నారు. ఇద్దరూ 6 సెంచరీలు చేశారు. అయితే సచిన్ 6 వన్డే వరల్డ్ కప్ లలో ఈ ఘనత సాధించగా.. రోహిత్ కేవలం 2 ప్రపంచకప్ లలోనే 6 సెంచరీలు బాదేయడం విశేషం. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఒక్క సెంచరీ చేస్తే చాలు సచిన్ ను అధిగమించి రోహిత్ టాప్ ప్లేసులో నిలుస్తారు.
సచిన్ బాటలోనే రోహిత్ నడుస్తున్నాడు. 2013లో తొలి డబుల్ సెంచరీ కొట్టాడు. అనంతరం 2015, 2017లలోనూ ఈ ఫీట్ సాధించాడు. వన్డేల్లో అత్యధిక స్కోరు 264 పరుగులు కూడా రోహిత్ పేరిటనే ఉంది.
వన్డేల్లో 49 సెంచరీలతో సచిన్ ముందున్నారు. ప్రస్తుతం రోహిత్ 30 సెంచరీలు చేశారు. రోహిత్ కెరీర్ ముగిసేలోగా మరో 19 సెంచరీలు చేస్తే ఆ రికార్డును బద్దలు కొట్టగలడు. మరో ఐదేళ్లు ఆడే సత్తా రోహిత్ లో ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత టెస్టులు, వన్డేలకే రోహిత్ పరిమితం కానున్నారు. సో ఈ సుధీర్ఘ ఫార్మాట్ లో సెంచరీలకు స్కోప్ ఉంది. కానీ 19 సెంచరీలు కొట్టడం అసాధ్యమే. కొడితే మాత్రం ఈ సచిన్ రికార్డును రోహిత్ చెరిపివేయగలడు.