Rules Ranjan Review: రూల్స్ రంజన్ మూవీ ఫుల్ రివ్యూ

హీరోయిన్ ద్వారా హీరో పడిన కష్టాలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవలు ఏంటి, అలాగే వాళ్ళిద్దరూ చివరికి కలుస్తారా లేదా విడిపోతారా అనే ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తూ డైరెక్టర్ రత్నం కృష్ణ ఈ సినిమాని తెరకెక్కించాడు.

Written By: Gopi, Updated On : October 6, 2023 11:24 am

Rules Ranjan Review

Follow us on

Rules Ranjan Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు.ఆయన హీరో గా ఈ వారం వచ్చిన సినిమా రూల్స్ రంజన్…కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు స్టోరీ తో సంబంధం లేకుండా ఆ క్యారెక్టర్లకి కనెక్ట్ అయిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటాం…అలాంటి సినిమాలకి స్టోరీ పెద్దగా అవసరం ఉండదు అలాంటి సినిమాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో చాలావరకు సక్సెస్ లు సాధిస్తాయి. మరి రూల్స్ రంజన్ సినిమా ప్రేక్షకుల ఆదరణను ఎంతవరకు సంపాదించుకుంది అనే విషయాలను ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఇక ముందుగా ఈ కథ విషయానికి వస్తే రంజన్ అనే వ్యక్తి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆయన పెట్టుకున్న రూల్స్ కి ఆ కంపెనీలో అందరూ అతని రూల్స్ రంజన్ అని పిలుస్తూ ఉంటారు.ఈ క్రమంలో హీరోయిన్ నేహా శెట్టి అదే కంపెనీలో పనిచేస్తూ ఆయనకి మంచి ఫ్రెండ్ గా మారుతుంది. ఇక హీరోయిన్ ద్వారా హీరో పడిన కష్టాలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవలు ఏంటి, అలాగే వాళ్ళిద్దరూ చివరికి కలుస్తారా లేదా విడిపోతారా అనే ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తూ డైరెక్టర్ రత్నం కృష్ణ ఈ సినిమాని తెరకెక్కించాడు. అయితే హీరో ఇవన్నీ ప్రాబ్లంలని సాల్వ్ చేశాడా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమాని చూడాల్సిందే…

ఇక ఈ సినిమా గురించి బ్రీఫ్ గా అనాలసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ సినిమాని డైరెక్టర్ మొదటి నుంచి చివరి వరకు కామెడీ గా నడిపే ప్రయత్నం చేశాడు…రంజన్ గా నటించిన కిరణ్ అబ్బవరం యాక్టింగ్ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో చాలా వరకు బెటర్ గా ఉంది. ఈయన చేసిన ప్రతి సీన్ కి కూడా న్యాయం చేస్తూ నటుడిగా ఒక మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ ని ఇచ్చాడనే చెప్పాలి…అయితే ఈ సినిమాకి డైరెక్టర్ అయిన రత్నం కృష్ణ చాలా వరకు సినిమాని సక్సెస్ చేసే ఎలిమెంట్స్ ని వాడుకుంటూ ముందుకు వెళ్ళాడు… అందులో భాగంగానే ఈ సినిమా లో వెన్నెల కిషోర్ ,సుదర్శన్, హైపర్ ఆది లాంటి వారితో ఎక్కువగా కామెడీ చేయిస్తూ ప్రేక్షకులను అలరించాడు. అజయ్, అభిమన్యు సింగ్ లను కూడా ఈ సినిమా లో బాగా చూపించాడు.అలాగే ఈ సినిమాకి సంబంధించిన ఇంటెన్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా అటు ఎమోషన్ ని, ఇటు కామెడీ ని రెండిటిని బ్యాలెన్స్డ్ చేసుకుంటూ సినిమాని ముందుకు తీసుకెళ్తూ ఒక ప్రేక్షకుడికి ఎలాంటి సినిమా అయితే కావాలో అలాంటి ఒక కమర్షియల్ సినిమాని అందించాడు.

ఇక కొన్ని సీన్లలో డైరెక్టర్ రాసుకున్న రైటింగ్ చాలావరకు హెల్ప్ అయింది. ప్రతి సీన్ కూడా ప్రేక్షకుడికి అద్భుతంగా చూపించడానికి ఆయన చాలావరకు ప్రయత్నం చేశారు ఇక ఈ సినిమా లో ముందుగా రిలీజ్ చేసిన సమ్మోహనుడా అనే సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది.దాంతో ఈ సినిమా మీద కూడా ప్రేక్షకులకు ముందు నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఆ అంచనాలతోనే ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ కూడా వస్తున్నాయి..

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన నేహా శెట్టి కూడా ఇంతకు ముందు చేసిన సినిమాలు వరుసగా సక్సెస్ లు కొడుతూ ఇండస్ట్రీ లో లక్కీ హ్యాండ్ గా పేరు తెచ్చుకుంది.ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే కిరణ్ అబ్బవరం యాక్టింగ్ అనే చెప్పాలి.ఇక హైపర్ ఆది ,వెన్నెల కిషోర్ల కామెడీ అలాగే నేహ శెట్టి అందం కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. అలాగే సమ్మోహనుడా అనే సాంగ్ విజువల్ గా చూసినప్పుడు కూడా ప్రేక్షకుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు…

ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ అయిన అంబ్రిష్ గణేష్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది. ముఖ్యంగా సమ్మోహనుడా సాంగ్ మాత్రం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. అలాగే ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు.సెకండ్ హీరోయిన్ గా నటించిన మెహర్ చాహెల్ కూడా తన పరిధి మేరకు చాలా బాగా నటించింది. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, అలాగే ఎడిటింగ్ కూడా అక్కడక్కడ ఇంకొంచెం షార్ప్ గా చేసి ఉంటే బాగుండేది.

ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటి అంటే స్టోరీని ఇంకొంచెం గ్రిప్పింగ్ రాసుకొని ఉంటే బాగుండేది. అలాగే డైరెక్టర్ కొన్ని సీనులను ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా బాగా అనిపించలేదు. ఎక్కువమంది ఆర్టిస్టులు ఉన్నారు కానీ వాళ్లను సరిగ్గా వాడుకోలేదు…మొత్తానికి ఈ సినిమా నార్మల్ కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది. అలాగే రొటీన్ సినిమాలు అంటే నచ్చని వాళ్ళకి ఈ సినిమా అంత పెద్దగా నచ్చదు…

రేటింగ్ 2.75/5…