ODI World Cup : ప్రస్తుతం ఇండియా లో జరుగుతున్నా వరల్డ్ కప్ చాలా ఆసక్తి కరంగా జరుగుతుంది. రోజుకొక ట్విస్ట్ తో ప్రేక్షకులకి విపరీతమైన ఆనందాన్ని ఇస్తుంది.ఇక ఇలాంటి క్రమం లో భారీ అంచనాలతో వరల్డ్ కప్ బరిలోకి దిగిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టీములు ఘోరం గా ఫెయిల్ అవుతున్నాయి. నిజానికి ఈ టోర్నీ లో ఎవరైతే బాగా ఆడుతారు అని అనుకున్నారో వాళ్లే ఫెయిల్ అవుతుండటం ఈ టీం లకి చాలా మైనస్ గా మారుతుంది.ఇక ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ ఇంతకు ముందు ఎప్పుడు లేని విధం గా ఈ వరల్డ్ కప్ లో మొత్తం 12 సెంచరీ లు నమోదు అయ్యాయి. ఇక ఈ నేపధ్యం లో మొత్తం వరల్డ్ కప్ హిస్టరీ లోనే ఇదే అత్యధిక సెంచరీ లు చేసిన వరల్డ్ కప్ టోర్నీ గా ఇప్పటికే చరిత్రలో నిలిచింది.ఇక ఇప్పటి వరకు ఆడిన మొత్తం వరల్డ్ కప్ టోర్నీ లలో ఎక్కువ రన్స్ చేసిన ఇండియన్ ప్లేయర్లు ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
ముందు గా క్రికెట్ గాడ్ గా పిలవబడే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మొత్తం వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు 44 ఇన్నింగ్స్ లు ఆడితే అందులో 2278 పరుగులు చేశాడు.ఇక అయన యావరేజ్56.95 గా ఉంది.అందులో ఆరు సెంచరీ లు, 15 హాఫ్ సెంచరీ లు ఉన్నాయి. ఇక రెండో ప్లేస్ లోరోహిత్ శర్మ ఉన్నాడు ఈయన 20 ఇన్నింగ్స్ లలో 1195 పరుగులు చేశాడు.ఇక దానికి తోడు గా ఆయన యావరేజ్ కూడా 66 .38 గా ఉంది.ఇక అందులో మొత్తం 7 సెంచరీలు ఉండటం విశేషం. ఇక మూడోవ ప్లేస్ లో కింగ్ విరాట్ కోహ్లీ ఉన్నాడు.ఈయన విషయానికి వస్తే ఈయన 29 ఇన్నింగ్స్ లలో 1186 పరుగులు చేశాడు. అందులో ఆయన యావరేజ్ వచ్చేసి 49.41 గా ఉంది.
ఇక అందులో రెండు సెంచరీ లు ఉన్నాయి…ఇక నాల్గొవ ప్లేస్ లో మాజీ ఇండియన్ టీం కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీ ఉన్నాడు.ఈయన విషయానికి వస్తే ఈయన మొత్తం వరల్డ్ కప్ లో 21 ఇన్నింగ్స్ లు ఆడితే అందులో 1006 పరుగులు చేసారు.ఇక యావరేజ్ వచ్చేసి 55.88 గా ఉంది అందులో 4 సెంచరీ లు ఉన్నాయి.ఇక నెంబర్ ఫైవ్ లో రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు ఈయన ఇప్పటివరకు 21 ఇన్నింగ్స్ లు ఆడితే అందులో 860 రన్స్ చేశాడు.అందులో ఆయన యావరేజ్ వచ్చేసి 61.42 గా ఉంది ఈయన 2 సెంచరీ లు చేశాడు.ఇలా వరల్డ్ కప్ లో ఇండియన్ టాప్ ప్లేయర్లు అయినా వీళ్లందరు కలిసి చేసిన పరుగులు ఇవే..
సచిన్ వరల్డ్ కప్ లో కూడా అరుదైన రికార్డు లు సాధించి తనకు ఎవ్వరు సాటిలేరు అని నిరూపించుకున్నారు. నిజానికి సచిన్ రన్స్ ని క్రాస్ చేసే అవకాశం ఇప్పుడున్నా ప్లేయర్లలో ఎవరు లేరు అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే 36 సంవత్సరాల వయసు ఉన్న రోహిత్ శర్మ కి ఇదే లాస్ట్ వరల్డ్ కప్ అనే విషయం మనకి అర్థం అవుతుంది.అలాగే కోహ్లీ కి కూడా ప్రస్తుతం 34 ఇయర్స్ ఉండటం తో ఈయన కి కూడా ఇదే లాస్ట్ వరల్డ్ కప్ అవ్వచ్చు అని తెలుస్తుంది. ఈ లెక్కన సచిన్ వరల్డ్ కప్ లో చేసిన 2278 పరుగుల రికార్డు ని ఇప్పుడప్పుడే ఎవరు బ్రేక్ చేయలేరనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తుంది.ఇక యావరేజ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ అందరికంటే ఎక్కువ యావరేజ్ 66.38 ని కలిగి ఉన్నాడు.
ఇక ఇప్పటి వరకు మన ఇండియన్ ప్లేయర్లలో ఇదే హైయెస్ట్ యావరేజ్ అనే విషయం కూడా చాలా స్పష్టం గా తెలుస్తుంది.ఇక దానికి తోడు గా ఆయన ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో 7 సెంచరీ లు చేసి చాలా టాప్ పొజిషన్ లో ఉన్నారు.ఈ వరల్డ్ కప్ లో ఇంకా సెంచరీ లు చేసే అవకాశం కూడా ఉంది…ఇలా ప్రస్తుతం ఉన్న టీం లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతూ టీం ని ముందు ఉండి నడిపిస్తున్నారు ఇక వీళ్ల ఇద్దరు కలిసి ఈసారి ఇండియన్ టీం కి వరల్డ్ కప్ అందించే పని లో ఉన్నారు…