https://oktelugu.com/

RK Big Debate With Revanth: ఇన్నాళ్లకు రేవంత్‌రెడ్డి ముందు ఒక్క నిజం మాట్లాడిన ఆర్కే!

కేటీఆర్‌ ఇంటర్వ్యూలో ముప్పు తిప్పలు పెట్టారు ఆర్కే. చివరకు తాము కొన్ని తప్పులు చేశాని ఒప్పుకునేలా చేశారు. ఆ తర్వాత రేవంత్‌ ఇంటర్వ్యూలోనూ కాంగ్రెస్‌పై ఆర్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 18, 2023 / 03:06 PM IST

    RK Big Debate With Revanth

    Follow us on

    RK Big Debate With Revanth: ఆంధ్రజ్యోతి ఎండీ.. అర్కే.. ఆలియాస్‌ వేమూరి రాధాకృష్ణ.. ఈ పేరు చాలా మందికి సుపరిచితమే. ముఖ్యంగా రాజకీయ నేతలకు చాలా మందికి ఆయన తెలుసు. జర్నలిజంలో ఉన్న ఆర్కే.. చాలా మందికి సన్నిహితంగా ఉన్నారు. అయితే మారిన రాజకీయ సమీకరణ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ను టీడీపీ అనుకూల మీడియాగా మార్చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాధాకృష్ణ చాలా మంది నాయకులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ ఇంటర్వ్యూ చేశారు. తర్వాత మూడు రోజులకే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు.

    రేవంత్‌రెడ్డితో ఆసక్తికర వ్యాఖ్యలు..
    కేటీఆర్‌ ఇంటర్వ్యూలో ముప్పు తిప్పలు పెట్టారు ఆర్కే. చివరకు తాము కొన్ని తప్పులు చేశాని ఒప్పుకునేలా చేశారు. ఆ తర్వాత రేవంత్‌ ఇంటర్వ్యూలోనూ కాంగ్రెస్‌పై ఆర్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంత రేవంత్‌కు అనుకూలంగా ఇంటర్వ్యూ చేసినా.. ఓ సందర్భంలో కాంగ్రెస్‌ గురించి చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘బీజేపీ భాషలో చెప్పాలంటే కాంగ్రెస్‌వాళ్లు సన్నాసులే’ అని రేవంత్‌ ముఖం ఎందుటే అన్నారు.

    సోషల్‌ మీడియాలో వైరల్‌..
    రాధా కృష్ణ కాంగ్రెస్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు దీనిని వైరల్‌ చేస్తున్నారు. ఎన్నికల వేళ ప్రతీ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఇప్పుడు రాధాకృష్ణ వ్యాఖ్యలను, బీజేపీ దృష్టిలో కాంగ్రెస్‌పై ఉన్న అభిప్రాయాన్ని చెప్పడంతో బీజేపీ నాయకులు నెట్టింట్లో ట్రోల్‌ చేస్తున్నారు. నెటిజన్లు స్మైల్‌ ఈమోజీలు పెడుతుండగా, కొంతమంది రాధాకృష్ణ ఇన్నాళ్లకు ఒక్క నిజం చెప్పారు.. రేవంత్‌ ఎదురుగానే కాంగ్రెస్‌ను తిట్టారు.. అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.