https://oktelugu.com/

Rinku Singh: రింకు సింగ్ సిక్స్ కొడితే మామూలుగా ఉండదు…అద్దాలు బద్దలవ్వాసిందే…వీడియో వైరల్

ఓపెనర్ ప్లేయర్లు ఇద్దరు కూడా డక్ అవుట్ అవ్వడంతో ఇండియన్ టీమ్ భారీ కష్టాల్లో పడింది. దాంతో సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ ఇద్దరు భాగా ఆడారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 13, 2023 / 10:58 AM IST

    Rinku Singh

    Follow us on

    Rinku Singh: ఇండియా సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టి20 మ్యాచ్ లో ఇండియన్ ప్లేయర్లు మొదట బ్యాటింగ్ చేసి అదరగొట్టారు.ముఖ్యంగా రింకు సింగ్ తనదైన రీతిలో భారీ షాట్లు కొడుతూ ఇండియన్ టీమ్ కి భారీ పరుగులు అందించే దిశగా ముందుకు దూసుకెళ్లాడు.ఇక ఇదే క్రమంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా హాఫ్ సెంచరీ చేసి ఇండియన్ టీమ్ కి గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో తన వంతు పాత్ర పోషించాడు.

    ఓపెనర్ ప్లేయర్లు ఇద్దరు కూడా డక్ అవుట్ అవ్వడంతో ఇండియన్ టీమ్ భారీ కష్టాల్లో పడింది. దాంతో సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ ఇద్దరు భాగా ఆడారు. ఇక రింకు సింగ్ 39 బంతుల్లో 68 పరుగులు చేసి తన కెరియర్ లో అత్యుత్తమమైన ఇన్నింగ్స్ ని కనబరిచాడు దాంతో పాటుగా ఇంటర్నేషనల్ టి20 మ్యాచ్ లో తన మొదటి హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక రింకు సింగ్ బ్యాటింగ్ చేస్తూ అద్భుతమైన సిక్సర్ కొట్టినప్పుడు మీడియా అద్దం పగిలిపోయింది. నిజానికి రింకు సింగ్ లాస్ట్ లో రెండు అద్భుతమైన సిక్స్ లు కొట్టాడు. అందులో ఒక సిక్స్ అద్దానికి తగిలి అద్దం పగిలింది ఇక అది చూసిన అందరూ రింకు సింగ్ భారీ షాట్లు కొట్టడంలో సిద్ధహస్తుడు అంటూ మరోసారి తనని పొగుడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

    ఇక ఈ మ్యాచ్ లో 19 ఓవర్ల 3 బంతులకి ఇండియన్ టీం ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది ఇక వర్షం రావడంతో మ్యాచ్ అప్పటికప్పుడు ఆపేశారు.వర్షం తగ్గిన తర్వాత సౌతాఫ్రికా టీం బ్యాటింగ్ కు వచ్చి 13 ఓవర్ల నుండి 154 పరుగులను పూర్తి చేసింది. ఇక దాంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం సౌతాఫ్రికా టీం గెలిచినట్టుగా ప్రకటించారు. 3 టి20 సిరీస్ లలో భాగంగా మొదటి టి20 మ్యాచ్ రద్దు అవ్వగా, రెండో మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిచింది. ఇక ఈ సిరీస్ ని సమం చేయాలంటే ఇండియా మూడో మ్యాచ్ లో తప్పకుండా గెలవాల్సి ఉంది…

    లేకపోతే సీరీస్ సౌతాఫ్రికా తీసికెళ్ళిపోతుంది. అందుకే మూడో మ్యాచ్ కొంచం జాగ్రత్త గా ఆడితే బాగుంటుంది….ఇక ఈ సీరీస్ ముగిస్తే మళ్ళీ వన్డే సీరీస్ మొదలవుతుంది. ఇక మూడో మ్యాచ్ కి అయిన వర్షం అడ్డుపడకుండ ఉంటే మంచింది…