Richest Countries in the World : 2022లో అమెరికా, యూరప్ లో సంపద తగ్గినా భారత్ లో ఎందుకు పెరిగింది?

టాప్ 20 దేశాలు చూస్తే రెండు నార్త్ అమెరికా, 10 యూరప్ లో.. ఆసియా ఫసిపిక్ లో 7 , లాటిన్ అమెరికాలో ఒకటి ఉంది. ఆసియాలో చూసుకుంటే చైనా, జపాన్, భారత్ తోపాటు దక్షిణకొరియా, తైవాన్, ఇండోనేషియా ఉంది. భారత్ 7వ స్థానంలో ఉంది.

Written By: NARESH, Updated On : August 22, 2023 9:33 pm

Richest Countries in the World : మొత్తం ప్రపంచంలో ఎంత సంపద ఉందో తెలుసా? 455 లక్షల కోట్ల డాలర్ల సంపద ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇందులో 140 లక్షల కోట్లు కేవలం అమెరికాలోనే ఉంది. మొత్తం సంపదలో 31శాతం అమెరికా వద్ద ఉంది. మరో 84 లక్షల కోట్ల డాలర్లు చైనాలో ఉంది. అంటే 19 శాతం చైనా వద్ద ఉంది. కేవలం రెండు దేశాల్లో 50శాతం సంపద పోగై ఉంది. మిగతా దేశాలు వాటి దరిదాపుల్లో కూడా లేవు.

టాప్ 20 దేశాలు చూస్తే రెండు నార్త్ అమెరికా, 10 యూరప్ లో.. ఆసియా ఫసిపిక్ లో 7 , లాటిన్ అమెరికాలో ఒకటి ఉంది. ఆసియాలో చూసుకుంటే చైనా, జపాన్, భారత్ తోపాటు దక్షిణకొరియా, తైవాన్, ఇండోనేషియా ఉంది. భారత్ 7వ స్థానంలో ఉంది.

రెండోది ప్రపంచంలో అత్యధిక మిలియననీర్లు కలిగిన టాప్ 15 దేశాలు చూస్తే.. అమెరికా టాప్ 1లో ఉంది. 22 కోట్ల 71 లక్షల మంది అమెరికాలో ఉన్నారు. చైనాలో 6 కోట్ల 23 లక్షల మంది, ఫ్రాన్స్ లో 2 కోట్ల 82 లక్షల మంది ఉన్నారు. టాప్ 14లో భారత్ 85 లక్షల మంది ఉన్నారు. ప్రపంచంలో మన వాటా 1.4 శాతం మాత్రమే ఉంది.

మూడో చార్ట్ చూస్తే.. అత్యంత ధనవంతులున్న టాప్ 16 దేశాలు చూస్తే.. చైనాలో 16.84 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ వాటాలో 24 శాతంతో నంబర్ 1గా ఉంది. అమెరికా 13.24 కోట్ల మందితో 18.9 శాతం వాటాతో అమెరికా రెండో స్థానంలో ఉంది. భారత్ లో 2.01 కోట్ల మంది ధనవంతులు ఉన్నారు. ప్రపంచ వాటా 2.9 శాతంగా ఉంది.

2022లో అమెరికా, యూరప్ లో సంపద తగ్గినా భారత్ లో ఎందుకు పెరిగింది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.