Jagan vs Ys Sharmila : అన్నా చెల్లెళ్లు గొడవ పడ్డారు. వీధిన పడ్డారు. జనం మధ్యకొచ్చారు. షర్మిలకు అన్యాయం జరిగిందట.. జగన్ అన్యాయం చేశాడని ఆమె వాపోతోంది. అందరూ అనుకుంటున్నట్టు ఆస్తి పంపకాల్లో గొడవలు వచ్చాయట.. షర్మిలకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా బయటకు తరిమేశాడన్న భావన జనంలోకి వచ్చింది.
వందల కోట్ల ఆస్తులకు సంబంధించిన వ్యవహారం.ఇందులో వైట్ ఎన్నో తెలియదు.. బ్లాక్ ెన్నో తెలియదు. వైఎస్ విజయమ్మ మాత్రం కూతురు షర్మిల వెంటనే ఉంది. ఆస్తులన్నీ జగన్ కూడబెట్టుకొని షర్మిలకు ఏం ఇవ్వలేదన్నది ప్రధానమైన టాక్. తెరవెనుక ఏం జరిగిందో తెలియదు.
మనకు తెలిసింది ఏంటంటే.. జగన్ జైల్లో ఉన్నంత కాలం షర్మిల అన్నీ తానై నడిపింది పార్టీని. తెలంగాణలో రాళ్లు వేసినా భరించింది. జగన్ జైలు నుంచి బయటకు రాగానే షర్మిలను దూరం పెట్టారు. అయినా అన్నయ్య కోసం ఓపిక పట్టింది. అన్నతో గొడవ ఎందుకని రాజకీయ రంగాన్ని తెలంగాణకు షిఫ్ట్ చేసింది. ఇంతకాలం జగన్ ఆస్తి పంపకాల కోసం ఎదురుచూసిన షర్మిల ఇప్పుడు బయటకు వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టింది. వీధినపడి జగన్ పై విమర్శలు గుప్పిస్తోంది.
షర్మిల ఇప్పుడు అన్నతో గొడవను మతాలపై గొడవకు తీసుకెళ్లింది. మణిపూర్ లో 2వేల చర్చిలను దహనం చేసినా జగన్ నోరు తెరవలేదని ఆరోపించింది.
మణిపూర్ లో జరిగేది రెండు తెగల కొట్లాటనా లేక క్రైస్తవులపై దాడా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.