Rahul Gandhi : రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర సందర్భంగా కశ్మీర్ లోని లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్టు చెప్పుకొచ్చాడు. త్రివర్ణ పతాకం ఇవ్వాలా జమ్మూకశ్మీర్ లో ఎగురవేయడంలో కొత్తేమీ లేదు. ఈ పరిస్థితిని తీసుకొచ్చి దానికి మోడీ ఘనత అని.. ఇంతటి ప్రశాంత వాతావరణంలో తాను జెండా ఎగురవేయడం వెనుక మోడీ పాలన ఉందని రాహుల్ చెప్పకనే చెప్పారు. ఇది నిజమా? కాదా? రాహుల్ సమాధానం చెప్పాలి. చరిత్రను తెలుసుకోవాలి. ఇందుకోసం ఎంత మంది బలిదానాలు చేశారో తెలుసా? రాహుల్ తెలుసుకోవాలి.
కశ్మీర్ లో మన జాతీయజెండా ఎగురవేసినందుకు కాల్పుల్లో చనిపోయారు ఎంతో మంది యువకులు. పెళ్లై వారం కూడా కాని ఒకతను కూడా ఇలా మరణించడం విషాదం నింపింది. కేవలం జాతీయ భావాలతో.. జమ్మూలో షేక్ అబ్దుల్లా చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా భారతీయ జెండాను ఎగురవేయాలని ప్రయత్నించి బలిదానాలు చేసుకున్నారు. వారి త్యాగాలను మరిచిపోయి ఇప్పుడు జెండా ఎగురవేస్తున్నామని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. జమ్మూ అమరులకు ఒక్కసారి రాహుల్ నివాళులర్పించి ఉంటే బాగుండేది.
కాశ్మీర్ లో త్రివర్ణ పతాకం కోసం జరిగిన బలిదానాలు.. రాహుల్ వ్యాఖ్యలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
