https://oktelugu.com/

Revanth Reddy : ఒకటి కాదు .. రెండు కాదు.. రేవంత్ 18 గంటల పని.. ఎంత నిజం?

రేవంత్ రెడ్డి రోజు తను 18 గంటలు పని చేస్తానని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ సర్కిల్ సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : February 10, 2024 / 08:51 PM IST
    Follow us on

    Revanth Reddy : “నాకు వయసు ఉంది. కష్టపడే సామర్థ్యం ఉంది. మీ సమస్యలు ఏమైనా నాకు చెప్పండి. ఒకవేళ నేను అందుబాటులో లేకుంటే మా మంత్రి వర్గానికి చెప్పండి. మీ సమస్యలు మొత్తం పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిది. నేను రోజు 24 గంటల్లో 18 గంటలు పని చేస్తూనే ఉంటాను.” ఈ మాటలు అన్నది ఎవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టిసి కొనుగోలు చేసిన 100 బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారని.. ఆ మార్పులో భాగంగానే ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను చిత్త శుద్ధితో అమలు చేస్తుందని రేవంత్ వివరించారు. అందుకే శనివారం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 50 వేల కోట్ల పైచిలుకు నిధులు కేటాయించామని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి.. అమలు చేసే విషయంలో విస్మరించిందని.. కానీ తమ ప్రభుత్వం అలా చేయబోదని ఆయన వివరించారు. మహాలక్ష్మి, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, వ్యవసాయ రుణమాఫీ.. ఇలా ఆరు పథకాలను తమ కచ్చితంగా అమలు చేస్తామని రేవంత్ అన్నారు.

    కాగా, రేవంత్ రెడ్డి రోజు తను 18 గంటలు పని చేస్తానని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ సర్కిల్ సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇదే విధంగా చెప్పారని.. ఆయన పార్టీలో కొనసాగిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నెటిజన్లు అంటున్నారు. కొంతమంది రేవంత్ రెడ్డి మాటలను ఉటంకిస్తూ గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను జత చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి 18 గంటలు పనిచేస్తున్నాడని.. మన సమస్యలు ఏవి ఉన్నా కూడా ఆయనకు చెప్పాలని కామెంట్లు చేస్తున్నారు.

    కాగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రికార్డు స్థాయిలో మహిళలు ప్రయాణం సాగించారని ప్రభుత్వం చెబుతోంది. బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందని అంటుంది. పథకాన్ని ప్రారంభించిన రెండు నెలల్లో ఆర్టీసీకి 350 కోట్ల చొప్పున నిధులు అందించామని ప్రభుత్వం చెబుతోంది. ప్రయాణికులనుంచి పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని 100 కొత్త బస్సులను కొనుగోలు చేశామని.. వాటిని శనివారం ప్రారంభించడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే అవకాశం ఆర్టీసీకి కలుగుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఆర్టీసీని పట్టించుకోలేదని.. తమ ప్రభుత్వం ఆర్టీసీ ప్రాధాన్యాన్ని గుర్తించి నిధులు కేటాయిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. కాగా తాను 18 గంటలు పని చేస్తానని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.