https://oktelugu.com/

Revanth Reddy : గుడిలోనే ప్యాంట్ పై పంచెకట్టాడు.. సంప్రదాయాలు తెలియవా సీఎం సార్?

పంచె.. రెండు అక్షరాల పదమే కావచ్చు.. మహా అయితే మూడు లేదా నాలుగు అడుగుల వస్త్రమే కావచ్చు. కానీ ఆ వస్త్రమే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టింది. 10 నిమిషాల పాటు నిలిచేలా చేసింది. తన గొప్పదనం ఏంటో అర్థమయ్యేలా వివరించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 13, 2024 / 02:12 PM IST
    Follow us on

    Revanth Reddy : పంచె.. రెండు అక్షరాల పదమే కావచ్చు.. మహా అయితే మూడు లేదా నాలుగు అడుగుల వస్త్రమే కావచ్చు. కానీ ఆ వస్త్రమే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టింది. 10 నిమిషాల పాటు నిలిచేలా చేసింది. తన గొప్పదనం ఏంటో అర్థమయ్యేలా వివరించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

    ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా సహచర మంత్రులతో కలిసి యాదగిరిగుట్ట వెళ్లారు. అక్కడ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అంకురార్పణ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఇందిరమ్మ పథకం ప్రారంభోత్సవానికి సంబంధించి భద్రాచలం వచ్చారు. భద్రాచలంలో రాముడు కొలువై ఉన్నాడు కాబట్టి.. దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడి ఆలయ నిబంధనల ప్రకారం.. స్వామివారి దర్శనానికి వచ్చేవారు కచ్చితంగా పంచె ధరించాలి. ఆడవాళ్ళు అయితే పంజాబీ డ్రెస్ లేదా చీర ధరించాలి. ఎటువంటి అధునాతనమైన డ్రెస్సులు ధరించి లోపలికి వస్తామంటే ఆలయ కమిటీ ఒప్పుకోదు. పైగా దర్శనానికి అనుమతించదు. ఇలాంటి అనుభవమే రేవంత్ రెడ్డికి కూడా ఎదురయింది. ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా అక్కడి ఆలయ సిబ్బంది ప్యాంట్ ధరించి గర్భాలయ దర్శనానికి ఒప్పుకోలేదు. దీంతో అప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం అధికారులు పంచ తెప్పించారు. సమయం లేకపోవడం.. ఇందిరమ్మ పథకం ప్రారంభోత్సవానికి గడువు దగ్గర పడుతుండడంతో రేవంత్ రెడ్డి చేసేదేమీ లేక.. గుడిలోనే పంచ ధరించారు.. ప్యాంటు మీద అలాగే పంచ కట్టుకొని ఆలయం లోపలికి వెళ్లారు.

    ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో రెండు రోజుల నుంచి సందడి చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి ఆలయ నిబంధనలు తెలియవా?, ఆలయంలో పంచ అలా ఎలా ధరిస్తారు? అంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా.. ముఖ్యమంత్రి తాను ప్యాంట్ ధరించినప్పటికీ.. అప్పటికప్పుడు ఆలయం మర్యాదల ప్రకారం పంచె కట్టుకున్నారని, మన సంస్కృతికి ఆయన చాలా విలువనిచ్చారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట గర్భాలయంలో కుర్చీపై కూర్చున్న వివాదం రెండు రోజులు మీడియాను ఊపేస్తే.. పంచ కట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది ఎన్ని రోజులు వ్యాప్తిలో ఉంటుందో చూడాలి.