https://oktelugu.com/

Revanth Reddy – Ministers : రేవంత్ టీమ్ లో ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత

ఇంతవరకు మంత్రి పదవి చేపట్టని రేవంత్ ఏకంగా సీఎం పోస్ట్ చేపట్టడం విశేషం. మండల జడ్పిటిసి నుంచి సీఎం పోస్టుకు ఎదగడం ప్రత్యేకత అయితే..

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2023 / 08:49 PM IST
    Follow us on

    Revanth Reddy – Ministers : తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి సీఎం గా, 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రేవంత్ క్యాబినెట్ లో ఇదివరకు మంత్రులుగా చేసిన వారికే బెర్త్ దక్కడం విశేషం. ఇంతవరకు మంత్రి పదవి చేపట్టని రేవంత్ ఏకంగా సీఎం పోస్ట్ చేపట్టడం విశేషం. మండల జడ్పిటిసి నుంచి సీఎం పోస్టుకు ఎదగడం ప్రత్యేకత అయితే.. మిగతా మంత్రులు సైతం ద్వితీయ శ్రేణి నాయకత్వం నుంచి ఎదిగిన వారే. వారి రాజకీయ రంగ ప్రవేశం, విద్యా అర్హతలు, రాజకీయ నేపథ్యం ఒక్కసారి తెలుసుకుందాం..

    * మధిర నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేశారు. డిగ్రీ వరకు చదువుకున్న ఆయన 2007 నుంచి 2009 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్నారు.

    * ఇక మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారత వైమానిక దళంలో పైలట్ గా పని చేశారు. డిగ్రీ వరకు చదువుకున్న ఆయన 1994లో రాజకీయ అరంగెట్రం చేశారు. 1999, 2004, 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.

    * మరో మంత్రి దామోదర రాజనర్సింహ 1989లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా తొలిసారిగా ఎంపికయ్యారు. 1999, 2004, 2009, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా పని చేశారు.

    * కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంజనీరింగ్ వర్క్ చదువుకున్నారు. 1999లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఎన్నికయ్యారు. 2019లో భువనగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.

    * దుద్దిల్ల శ్రీధర్ బాబు విద్యాధికుడు. ఎంఎ ఎల్ఎల్బి పూర్తి చేశారు . 1999లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1999, 2004, 2009, 2018, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

    * పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశారు. ఎల్.ఎల్.బి పట్టాపుచ్చుకున్నారు. 2013లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014లో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలుపొందారు. 2016లో టిఆర్ఎస్ లో చేరారు. 2023 ఎన్నికల్లోకాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

    * పొన్నం ప్రభాకర్ ఎంఏ ఎల్ ఎల్ బి పూర్తి చేశారు. 2009లో కరీంనగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.

    * కొండా సురేఖ డిగ్రీ పూర్తి చేశారు. 1995లో ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1999, 2004, 2009, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో టిఆర్ఎస్ లో చేరారు. 2018 నాటికి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.

    * సీతక్క విద్యాధికురాలు. పి హెచ్ డి పూర్తి చేశారు. 1996 వరకు మావోయిస్టుగా అడవి జీవితం అనుభవించారు. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత 2004లో టిడిపిలో చేరారు. 2009, 2018, 2023లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

    * తుమ్మల నాగేశ్వరరావు డిగ్రీ వరకు చదువుకున్నారు. 1978లో రాజకీయ అరంగెట్రం చేశారు. 1985, 1994, 1999, 2009, 2014, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. టిడిపిలో సుదీర్ఘకాలం పని చేశారు. 2014లో టిఆర్ఎస్ లో చేరారు. ఈ ఎన్నికల ముందే కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు.

    * జూపల్లి కృష్ణారావు 2004లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2004, 2009, 2012, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల ముంగిట కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు.