https://oktelugu.com/

Sonia Gandhi : సోనియాగాంధీ రిటైర్ మెంట్

రాహుల్‌ గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయిస్తారా లేక ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువస్తారా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : February 15, 2024 / 08:48 PM IST
    Follow us on

    Sonia Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ పాతికేళ్ల ప్రత్యక్ష రాజకీయ పోరాటం ముగిసింది. ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అందుకే ఆమె ఈసారి రాజ‍్యసభకు నామినేషన్‌ వేసినట్లు చెబుతున్నారు. అయితే సోనియాగాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. 1999 నుంచి సోనియాగాధీ లోక్‌సభకు ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే తాజాగా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పార్టీ ప్రతిపక్షలో ఉన్నప్పుడు మార్గనిర్దేశం చేసిన సోయియా, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ చైర్‌పర్సన్‌గా అధికారం అనుభవించారు.

    అధ్యక్ష బాధ్యత నుంచి తప్పుకుని..
    సోనియాగాంధీ ఇటీవలే పార్టీ అధ‍్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేను ఎన్నుకున్నారు. తాజాగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. లోక్ సభ సభ్యురాలుగా ఆమె పాతికేళ్లు పూర్తి చేశారు. ప్రత్యర్థుల నుంచి విదేశీయురాలంటూ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో రాజకీయాలు కొనసాగించారు. పార్టీ అయోమయం, గందరగోళంగా ఉన్న సమయంలో పార్టీకి నేతృత్వం వహించి గాడిన పెట్టారు. 77 ఏళ్ల సోనియా గాంధీ ఇక తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇకపై తాన గళాన్ని రాజ్యసభ నుంచి వినిపించబోతున్నారు.

    రిటైర్మెంట్‌పై ప్రచారం..
    సోనియాగాంధీ రాజకీయాల నుంచి రిటైర్‌ అవుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఆవకాశం లేదని తాజా నిర్ణయంతో స్పష్టమైంది. ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రమే గుడ్‌బై చెప్పారు. పరోక్షంగా పెద్దల సభ నుంచి తన గలం వినిపించబోతున్నారు. తాను రాజకీయాల్లో కొనసాగుతానని పార్టీ కార్యకర్తలకు స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు గురువారం (ఫిబ్రవరి 15న) నామినేషన్ దాఖలు చేశారు. గతంలో రాజస్థాన్‌ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వం వహించారు. ఆయన అనారోగ్యం దృష్ట్యా ప్రస్తుతం రాజకీయాల నుంచి తప్పుకునా‍్నరు.

    అమె  నుంచి..
    గాంధీ కుటుంబానికి అమేథీ లోక్‌సభ నియోజకవర్గం అచ్చివచ్చింది. దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సోనియా కూడా అక్కడి నుంచే తొలుత పోటీ చేశారు. తర్వాత రాయబరేలీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి రెండుసార్లు గెలిచారు. రాజీవ్‌గాంధీ హత్య జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అస్తవ్యస్తంగా మారిన కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను భుజాన ఎత్తుకున్నారు. కష్టకాలం నుంచి పార్టీని గట్టెక్కించారు. పార్లమెంటులోను తన వాయిస్‌ బలంగా వినిపించారు. మహిళా రిజర్వేషన్‌ విషయంలో ప్రభుత్వం తీరును ప్రశ్నించారు. ఎంపీల సస్పెన్షన్‌పైనా గలం విప్పారు.

    విదేశీయురాలిగా ముద్ర..
    సోనియాగాంధీ కాంగ్రెస్‌ పార్టీని ఎంత బలోపేతం చేసినా.. ఆమె విదేశీయురాలు అన్న ముద్ర మాత్రం పోలేదు. మొదట శరద్‌పవార ఈ అంశం లేవనెత్తారు. తర్వాత బీజేపీ దానిని పట్టుకుంది. సోనియా ప్రస్తుతం రాయబరేలీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. రాహుల్‌ గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయిస్తారా లేక ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువస్తారా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది.