https://oktelugu.com/

Gaddar : ఒంట్లో తూటా.. అగని పాట.. ఇదీ గద్దర్ గుండె చప్పుడు

1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌ పై హత్యాయత్నం జరిగింది. అప్పటి నుంచి తూటాలు ఆయన శరీరంలోనే ఉండిపోయాయి.

Written By:
  • NARESH
  • , Updated On : August 6, 2023 / 10:05 PM IST
    Follow us on

    Gaddar : తన పాటలతో యావత్‌ తెలంగాణ సమాజాన్ని జాగృత పరిచి..అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువై నిలిచిన గద్దర్‌ ఆకస్మికంగా కన్ను మూయడాన్ని ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా ప్రాంతాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. 1949 జూన్‌ 5న ఉమ్మడి మెదక్‌ జిల్లా తుఫ్రాన్‌ ప్రాంతంలో గుమ్మడి విఠల్‌ రావు అలియాస్‌ గద్దర్‌ జన్మించారు. గద్దర్‌ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. గద్దర్‌ నిజామాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో విద్యాభ్యాసం సాగించారు. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించారు. తన మాటలనే పాటలుగా మలచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చారు. 75 ఏళ్ల వయసున్న గద్దర్‌.. ఆయన సగానికి కంటే ఎక్కువ జీవితాన్ని ఉద్యమాలకే అంకితం చేశారంటే ఆశ్యర్యం అనిపించకమానదు. కారంచేడు దళితుల హత్య, ఫేక్‌ ఎన్‌ కౌంటర్లు, బషీర్‌ బాగ్‌ విద్యుత్‌ ఉద్యమం, తెలంగాణ పోరాటం..ఇలా ప్రతీ అంశంలోనూ గద్దర్‌ ఉన్నాడు.

    మలి దశ తెలంగాణ ఉద్యమంలో గద్దర్‌ క్రియాశీలక పాత్ర పోషించాడు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా అనే పాట ఉద్యమానికి కొత్త ఊపు తీసుకొచ్చింది. అంతే కాదు ఆ పాట కొన్నాళ్ల పాట తెలంగాణ అస్తిత్వ గీతిక మారిందనడంలో అతిశయోక్తి కాదు. 1971లో ప్రఖ్యాత దర్శకుడు నర్సింగరావు ప్రోత్సాహంతో గద్దర్‌ ఆపరా రిక్షా అనే పాట రాశారు. 1975లో గద్దర్‌ కెనరా బ్యాంక్‌లో ఉద్యోగం చేశారు. 1987లో కారంచేడులో జరిగిన దళితుల హత్యలపై గద్దర్‌ పోరాడారు. అంతేకాకుండా నకిలీ ఎన్‌ కౌంటర్ల ను సైతం గద్దర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌ పై హత్యాయత్నం జరిగింది. అప్పటి నుంచి తూటాలు ఆయన శరీరంలోనే ఉండిపోయాయి. 2002లో నక్సల్స్‌ తరఫున ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. కాగా, గద్దర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. జన నాట్య మండలి వ్యవస్థాపకుల్లో గద్దర్‌ ఒకరు.