https://oktelugu.com/

Mahesh Remunaration : ఫోన్ పేలో మహేష్ బాబు వాయిస్… ఐదు సెకండ్స్ కి అన్ని కోట్లా? సూపర్ స్టార్ రేంజ్!

తాజాగా గుంటూరు కారం మూవీ తో ప్రేక్షకులను అలరించారు. ఇక నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ SSMB29 కోసం సిద్ధం అవుతున్నాడు...

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2024 / 09:31 AM IST
    Follow us on

    Mahesh Remunaration : టాలీవుడ్ టాప్ స్టార్స్ ఒకరైన మహేష్ బాబు సినిమాకు యాభై కోట్లకు పైగా తీసుకుంటున్నారు. మరోవైపు కమర్షియల్ ప్రమోషన్స్, యాడ్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పటికే పలు టాప్ మోస్ట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహస్తున్నారు. మహేష్ బాబు టాలీవుడ్ హీరోల్లో అత్యధిక బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు. మహేష్ కోసం వ్యాపార సంస్థలు ఎగబడుతున్నాయి.

    ఇక తాజాగా మహేష్ బాబు తన గొంతు అరువు ఇచ్చారు. దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ బాగా పెరిగిపోయాయి. పెద్ద పట్టణాల నుంచి మారుమూల పల్లెల వరకు డిజిటల్ పేమెంట్స్ హవా నడుస్తోంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. కాగా మనం ఎంత పే చేశాము అనేది ఆ స్పీకర్ ద్వారా వినిపిస్తుంది. ఈ ఫోన్ పే లావాదేవీల కోసం కంప్యూటర్ జెనెరేటడ్ వాయిస్ వాడుతున్నారు.

    తాజాగా ఫోన్ పే సూపర్ స్టార్ మహేష్ బాబుతో టై అప్ అయింది. ఇక నుంచి ఫోన్ పే లో డబ్బు చెల్లించిన తర్వాత మనకు మహేష్ బాబు వాయిస్ వినిపిస్తుంది. అంటే మనం ఫోన్ పే ద్వారా డబ్బు చెల్లిస్తే .. ’50 రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థాంక్యూ బాస్’ అంటూ మహేష్ చెబుతారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా మహేష్ బాబు 5 సెకన్ల వాయిస్ కోసం రూ. 5 కోట్లు తీసుకున్నారట.

    అయితే గతంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇలానే ఫోన్ పే కు వాయిస్ అందించారు. ఆయన తర్వాత వాయిస్ ఇచ్చిన నటుడు మహేష్ బాబు కావడం విశేషం. ఇప్పటికే 25 బ్రాండ్లను ప్రమోట్ చేశారు. ఇలా యాడ్స్ ద్వారా వచ్చిన సంపాదన సేవా కార్యక్రమాలకు మహేష్ ఉపయోగిస్తున్నారు. తాజాగా గుంటూరు కారం మూవీ తో ప్రేక్షకులను అలరించారు. ఇక నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ SSMB29 కోసం సిద్ధం అవుతున్నాడు…