https://oktelugu.com/

Guntur Kaaram song : గుంటూరు కారం సాంగ్ : కుర్చీ మడతపెట్టి కొట్టిన మహేష్ బాబు.. ఊపేశాడు పో

తమన్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ప్రోమో విడుదలైనప్పటి నుంచి హైప్ వచ్చిన ఈ సాంగ్ అంతకుమించి మాస్ జనాలను ఊపేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : December 30, 2023 / 04:55 PM IST
    Follow us on

    Guntur Kaaram song : సంక్రాంతి రేసులోకి ఘనంగా ‘కుర్చీ మడతపెట్టి’ వచ్చేశాడు మహేష్ బాబు.. గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    తాజాగా గుంటూరు కారం మూవీ చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఊర మాస్ సాంగ్ ను రిలీజ్ చేసింది. ‘కుర్చీ మడతపెట్టి’ అంటూ సాగే వీడియో సాంగ్ ను తాజాగా రిలీజ్ చేసింది.

    తమన్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ప్రోమో విడుదలైనప్పటి నుంచి హైప్ వచ్చిన ఈ సాంగ్ అంతకుమించి మాస్ జనాలను ఊపేసింది.

    ఈ పాటలో శ్రీలీల దుమ్మురేపగా.. మహేష్ బాబు ఎప్పుడూ లేనంతా మాస్ గా డ్యాన్స్ చేశారు. దీంతో దుమ్ముదులిపేసింది.

    ఆ వీడియో సాంగ్ ను మీరూ చూసేయండి.