
ఏపీలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎప్పటికప్పుడు సంచలనమే. ఆయన పార్టీ మార్పు కూడా అలాంటిదే. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఆయనే స్వయంగా మీడియాకు చెప్పుకున్నట్లుగా ఇప్పటికి వందల సార్లు మీడియాలో వచ్చింది. ఒక విధంగా అది సంచలనం స్టేజ్ దాటేసి ఒక మామూలు వార్త కూడా అయిపోయింది.
Also Read: ఉక్కు ఉద్యమం నుంచి వైసీపీ తప్పుకున్నట్లేనా..? బంద్‌కు మద్దతు లేనట్లేనా..?
అయితే.. దానికి మళ్లీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హైప్ తెచ్చారు. ఆయన తాజాగా గంటా కూడా వైసీపీలో చేరేందుకు సుముఖం అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసరికి పెద్ద సెన్సేషన్ అయింది. వైసీపీలో కీలక నేత నోటి వెంట ఇలా న్యూస్ రావడంతో బాల్ వచ్చి గంటా కోర్టులో పడింది. దాని మీద మీడియా అడిగిన ప్రశ్నలకు గంటా నేరుగా సమాధానం చెప్పకుండా తన మీద ఇలా న్యూస్ వస్తూనే ఉందంటూ చెప్పడం విశేషం.
అంతేకాదు.. తాను వైసీపీలో చేరడం లేదని ఓ వైపు అంటూనే తాను ఏం చేసినా సీక్రెట్ గా చేయనని, అందరికీ చెప్పే చేస్తానని చెప్తున్నారు. పైగా వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని గంటా అనడంతో దానికి వైసీపీ నేతలు గట్టిగానే రిటార్ట్ ఇచ్చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే మాకు మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. వైసీపీలోకి వస్తానని గంటాయే తన అభిలాషను వ్యక్తం చేశారు అంటూ తాజాగా మరో స్టేట్మెంట్ ఇచ్చారు.
Also Read: విశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్ షిఫ్ట్
పైగా గంటా వచ్చినా రాకున్న వైసీపీ రాజకీయానికి ఎలాంటి మార్పు ఉండదని కూడా చెప్పడం విశేషం. అంటే గంటా వైసీపీలోకి రావడానికి ప్రయత్నించారా లేదా అన్నది ఇప్పుడు ఆయనే చెప్పాలన్నది వైసీపీ నేతల మాటగా ఉంది. మొత్తానికి గంటా గుట్టుని విజయసాయిరెడ్డి అలా బయటపెట్టారా అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చగా ఉంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్