https://oktelugu.com/

Razakar Director : నాని హీరో అయ్యాక బాగా ఆటిట్యూడ్ చూపించాడు అంటున్న రజాకార్ మూవీ డైరెక్టర్…

ఇక ఆ తర్వాత నుంచి నాని ని కలుద్దాం అంటే ఎప్పుడు కలిసేవాడు కాదని, అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేసేవాడు కాదని ఒకప్పుడు అన్నా అన్నా అనుకుంటూ తన వెంట తిరిగిన నాని హీరో అయిన తర్వాత మాతో మాట్లాడడం మానేసాడు అని నాని గురించి సంచలమైన వ్యాఖ్యలు చేశాడు.

Written By:
  • NARESH
  • , Updated On : March 18, 2024 / 08:35 PM IST

    Director Yata Satyanarayana

    Follow us on

    Razakar Director : ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ అవ్వడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది బ్యా గ్రౌండ్ సపోర్ట్ తో ఇండస్ట్రీ కి వస్తే మరి కొంతమంది సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ లను సాధిస్తూ స్టార్ హీరోలుగా ఎదుగుతూ ఉంటారు. ఇక అలాంటి వాళ్ళలో చిరంజీవి స్టార్ హీరో అయి అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలిస్తే, ఆ తర్వాత రవితేజ కూడా సోలో గా వచ్చి తనకంటూ ఒక మార్క్ ని సెట్ చేసుకున్నాడు. ఇక ఎప్పుడు ఈ జనరేషన్ లో అయితే తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను ఏర్పాటు చేసుకొని స్టార్ హీరోగా ఎదుగుతున్నాడనే చెప్పాలి…

    ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా రజాకార్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న దర్శకుడు యాట సత్యనారాయణ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు. ఆయన ఇప్పటి వరకు చాలా సీరియల్స్ ని డైరెక్షన్ కూడా చేశాడు. అలాగే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సీరియల్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. అయినప్పటికీ తన డ్రీమ్ మొత్తం సినిమా మీదనే ఉండడంతో ఎలాగైనా సరే సినిమా చేయాలని మొత్తానికైతే రజాకార్ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు…

    ఆయన రీసెంట్ ఒక ఇంటర్వ్యూ లో నాని గురించి మాట్లాడుతూ నాని తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడని, తను హీరో అయిన విషయం కూడా పోస్టర్ మీద చూసే దాకా ఆయనకు చెప్పలేదని.. అయిన కూడా తను ఏమాత్రం ఇబ్బంది పడకుండా ‘అష్టాచమ్మ’ సినిమాను చూసి నాని కి ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని నువ్వు చాలా బాగా చేసావని అప్రిషియేట్ చేశానని చెప్పాడు.

    ఇక ఆ తర్వాత నుంచి నాని ని కలుద్దాం అంటే ఎప్పుడు కలిసేవాడు కాదని, అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేసేవాడు కాదని ఒకప్పుడు అన్నా అన్నా అనుకుంటూ తన వెంట తిరిగిన నాని హీరో అయిన తర్వాత మాతో మాట్లాడడం మానేసాడు అని నాని గురించి సంచలమైన వ్యాఖ్యలు చేశాడు. నాని గురించి చెబుతూనే సక్సెస్ వచ్చినంత మాత్రాన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మర్చిపోకూడదు కదా అంటూ నాని మీద ఘాటు వ్యాఖ్యలైతే చేశాడు…