https://oktelugu.com/

Ravichandran Ashwin : శ్రీలీలపై మనసు పారేసుకున్న రవిచంద్రన్ అశ్విన్.. ఆమె డ్యాన్స్ చూడాలంటూ ఫ్రెండ్ కు రిక్వెస్ట్

"ఆ పాటలో శ్రీ లీల (Sri Leela) డ్యాన్స్ అద్భుతంగా ఉంది. మహేష్ బాబు (Mahesh Babu) నటన, డాన్స్ వేరే లెవెల్ లో ఉంది. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. నేను ఆ డ్యాన్స్ ను బాగా ఆస్వాదించానని" రవిచంద్రన్ కామెంట్ చేశాడు. తన స్నేహితుడితో మాట్లాడిన వీడియో కాల్ కు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రవిచంద్రన్ అశ్విన్ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 21, 2024 / 09:58 PM IST

    Ravichandran Ashwin, who was fond of Srileela's dance in the movie 'Gunturukaram'

    Follow us on

    Ravichandran Ashwin : గుంటూరు కారం సినిమాలో “కుర్చి మడత పెట్టి” పాట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ పాటపై రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ.. ఇందులో శ్రీ లీల చేసిన డ్యాన్స్ చాలామందికి నచ్చింది. ఈ పాటలో డ్యాన్స్ చేస్తుంటే దూల తీరిపోయిందంటూ మహేష్ బాబు కామెంట్ చేశారంటే శ్రీ లీల నర్తించిన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. యూట్యూబ్లో ఈ పాట ఇప్పటికే మిలియన్ల వ్యూస్ నమోదు చేసింది. అయితే ఈ పాట టీం ఇండియన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కు తెగ నచ్చింది. అదే విషయాన్ని ఆయన తన స్నేహితుడితో పేర్కొన్నారు. దీంతో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

    సంక్రాంతికి గుంటూరు కారం సినిమా విడుదలైంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ మిశ్రమ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో శ్రీ లీల చేసిన డ్యాన్స్ చూసి టీం ఇండియా ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మనసు పారేసుకున్నాడు. ఆ సినిమాను ఆకాశానికి ఎత్తాడు. ముఖ్యంగా శ్రీ లీల డ్యాన్స్ ఆకట్టుకుందని పేర్కొన్నాడు. ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ తన మిత్రుడితో వీడియో కాల్ మాట్లాడాడు. “గుంటూరు కారం సినిమా చూశారా” అని అతడు అడగగా..”నేను చూడలేదు. నాకు సమయం ఉండదు. నేను కేవలం రజినీకాంత్ సినిమాను మాత్రమే చూస్తానని” అతడు బదులిచ్చాడు. దీంతో అశ్విన్ స్పందించాడు..”తప్పనిసరిగా గుంటూరు కారం సినిమాను చూడాలని కోరాడు. యూట్యూబ్లో గుంటూరు కారం, శ్రీ లీల (sree Leela) డ్యాన్స్ అనే టైప్ చేస్తే ఆ పాట వస్తుంది. ఆ పాట చూసిన తర్వాత మీ నిర్ణయాన్ని మార్చుకుంటారు. మీ అద్భుతమైన నటుల జాబితాలో మహేష్ బాబు (Mahesh Babu) చోటు సంపాదించుకుంటాడని పేర్కొన్నాడు.

    “ఆ పాటలో శ్రీ లీల (Sri Leela) డ్యాన్స్ అద్భుతంగా ఉంది. మహేష్ బాబు (Mahesh Babu) నటన, డాన్స్ వేరే లెవెల్ లో ఉంది. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. నేను ఆ డ్యాన్స్ ను బాగా ఆస్వాదించానని” రవిచంద్రన్ కామెంట్ చేశాడు. తన స్నేహితుడితో మాట్లాడిన వీడియో కాల్ కు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రవిచంద్రన్ అశ్విన్ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.