Dhamaka Movie Review: నటీనటులు : రవితేజ , శ్రీ లీల , జయరాం , హైపర్ ఆది, సచిన్ కెద్కర్
రచన/దర్శకత్వం : త్రినాథ రావు నక్కిన
మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత : అభిషేక్ అగర్వాల్

చాలా కాలం తర్వాత మాస్ మాస్ మహారాజ రవితేజ సినిమా మీద జనాలు భారీ అంచనాలు పెట్టుకున్న ‘ధమాకా’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..క్రాక్ సినిమా తర్వాత రవితేజ నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన ఫ్లాప్స్ గా నిలిచి అభిమానులను తీవ్రమైన నిరాశకి గురి చేసిన సమయం లో వచ్చిన ధమాకా మూవీ టీజర్ , ట్రైలర్ మరియు పాటలు..ఈ చిత్రం మీద అంచనాలు పెంచడం లో దోహదపడ్డాయి..’నేను లోకల్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన త్రినాథ రావు నక్కిన దారకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా లేదా..?, రవితేజ హిట్ కొట్టాడా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.
కథ :
ధమాకా స్వామి(రవితేజ) అనే మధ్య తరగతి కుర్రాడు జీవితం లో ఎలాంటి లక్ష్యాలు లేకుండా ఖాళీగా స్నేహితులతో ఆవారా లాగ తిరుగుతుంటాడు..వీటితో పాటు ఆయన ఒక అమ్మాయి తో లవ్ ట్రాక్ కూడా నడుపుతుంటాడు..కానీ ధమాకా స్వామీ తో పోలిన ఆనంద్ చక్రవర్తి(రవితేజ ) తో ప్రేమలో పడుతుంది..ఇద్దరు తమ జీవితాలు మార్చుకున్న తర్వాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి..అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ :
కథ చాలా రొటీన్ గా ఉన్నప్పటికీ రవితేజ నుండి మన అందరం కోరుకునే ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి.ఈ సినిమాకి కామెడీ గుండె లాంటిది..అది లేకపోతే రవితేజ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచిపోయేది ఈ చిత్రం..ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చక్కటి స్క్రీన్ ప్లే తో సినిమాని మదించిన త్రినాథరావు నక్కిన..కానీ రొటీన్ స్టోరీ కాకుండా కాస్త కొత్తరకం గా తీసి ఉంటె ఈ చిత్రం మరో లెవెల్ కి వెళ్ళేది కదా అనే అనుభూతి చూసిన ఈ చిత్రాన్ని చూసే ప్రతీ ఒక్కరిలో కలుగుతుంది..ఇక శ్రీ లీల కూడా ఈ సినిమాకి ప్రధాన హైలైట్ గా నిలిచింది..ముఖ్యంగా ఆమె వేసే డ్యాన్స్ స్టెప్స్ కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి..నటన కూడా పర్వాలేదు అనిపించింది..ఇక హైపర్ ఆది కామెడీ బాగా పేలింది..ఆయన కెరీర్ లోనే ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ రోల్ పడిన చిత్రంగా చెప్పుకోవచ్చు..ప్రేక్షకులు ఆయన పంచులను బాగా ఎంజాయ్ చేసారు.

ఇక ఈ సినిమా మీద విడుదలకు ముందు అంత పాజిటివ్ బజ్ రావడానికి కారణం మ్యూజిక్..భీమ్స్ సిసిలోరెయో అనే నూతన సంగీత దర్శకుడు ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం..ముఖ్యంగా ‘జింతాక్ జింతాక్’ అనే పాట వచ్చినప్పుడు థియేటర్ లో మాస్ ఆడియన్స్ ఊగిపోయారు..యూట్యూబ్ లో కూడా ఈ పాటకి 30 మిలియన్ వ్యూస్ వచ్చాయి..కేవలం ఈ ఒక్క పాట మాత్రమే కాదు..సినిమాలోని అన్ని పాటలు మాస్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చే విధంగా ఉన్నాయి.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదుర్స్.
చివరి మాట :
రవితేజ మార్క్ కామెడీ ని ఎంజాయ్ చేసే వారికి ఈ సినిమా నచ్చుతుంది..కథలో కొత్తదనం కోరుకునే వాళ్లకు మాత్రం నచ్చదు..ఒక పక్కా మాస్ కమర్షియల్ సినిమాని చూడాలి..కాసేపు టైం పాస్ అవ్వాలి అనుకునేవాళ్లకు ఈ సినిమా వీకెండ్ కి బెస్ట్ ఛాయస్.
రేటింగ్ : 2.25 /5