India Vs Pakistan Asia Cup: ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో అరుదైన సంఘటన…

ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే దేశం లోనే కాదు ప్రపంచం లో కూడా చాలా మంది ఈ మ్యాచ్ ను చూడటానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు.

Written By: Suresh, Updated On : September 11, 2023 9:47 am

India Vs Pakistan Asia Cup

Follow us on

India Vs Pakistan Asia Cup: ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన కొద్దిసేపటికే వర్షం వచ్చి మ్యాచ్ నిలిచిపోయింది.ఇక అప్పటికే ఇండియా 24.1 ఓవర్లకి 147 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బౌలింగ్ తీసుకుంది ఇక చేసేదేం లేక ఇండియా మొదట బ్యాటింగ్ కి వచ్చింది రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇద్దరు కూడా మొదట కొంచం నెమ్మదిగా ఆడిన కూడా ఆ తర్వాత ఎదురు దాడికి దిగి పాకిస్థాన్ బౌలార్లకి చుక్కలు చూపిస్తూ పవర్ ప్లే లో ఒక్క వికెట్ కూడ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా, తెలివిగా ఈ మ్యాచ్ ను ఆడారు.అయితే ఇద్దరు కూడా హాఫ్ సెంచరీ లు నమోదు చేసుకున్నారు… రోహిత్ 56 పరుగులు చేసి ఔట్ అయితే, గిల్ మాత్రం 58 పరుగులు చేసి ఔట్ అయ్యారు వరుసగా రెండు ఓవర్లలో వీళ్ళు ఇద్దరు కూడా ఔట్ అయి పోయారు.అప్పటి దాకా డౌన్ లో ఉన్న పాకిస్థాన్ బౌలర్లకు ఒక్కసారి గా మంచి ఊపు వచ్చిందనే చెప్పాలి… ఇక వీళ్ళ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కోహ్లీ, రాహుల్ ఇద్దరు కూడా చాలా నిధానంగా వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. అయితే 24 ఓవర్ ఒక బాల్ దగ్గర వర్షం రావడం తో మ్యాచ్ కి అంతరాయం కలిగింది ఇక దాంతో మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్ లోకి బ్యాట్స్ మెన్స్ వెళ్లిపోవడం జరిగింది…అయితే అప్పటికి 16 బంతుల్లో 8 రన్స్ చేసిన కోహ్లీ నాటౌట్ గా క్రీజ్ లో ఉన్నాడు. అలాగే రాహుల్ 28 బంతుల్లో 2 ఫోర్లు కొట్టి 17 పరుగులు చేసి తను కూడా నాటౌట్ గానే ఉన్నాడు…ఇక నైట్ మొత్తం వర్షం ఉండటం తో రిజర్వు డే ఉంది అని ఆల్రెడీ డిక్లేర్ చేయడం తో ఆ మ్యాచ్ ని అపెసారు.ఇక నెక్స్ట్ డే ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోయిందో అక్కడినుంచే ఈ మ్యాచ్ ను స్టార్ట్ చేస్తారు.

ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే దేశం లోనే కాదు ప్రపంచం లో కూడా చాలా మంది ఈ మ్యాచ్ ను చూడటానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అలాంటిది నిన్న జరిగిన మ్యాచ్ ను చూడటానికి స్టేడియం లో అసలు మనుషులే లేరు అంటే దీని అర్థం ఈ మ్యాచ్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అని కాదు ఈ మ్యాచ్ మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉంది కానీ వర్షం ఉండటం తో ఎవరు కూడా మ్యాచ్ చూడటానికి గ్రౌండ్ కి రాలేదు అనే విషయం అయితే స్పష్టం అర్థం అవుతుంది. అయితే 15000 మంది చూడటానికి అనుకూలంగా ఉన్న ఈ గ్రౌండ్ లో అసలు జనాలే లేకపోవడం చూస్తుంటే అసలు మనం చూస్తున్నది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏనా అనేంత అనుమానం కూడా జనాలకి కలిగింది…

ఇక మ్యాచ్ నిన్న ముగియడంతో ఇవాళ్ళ మళ్ళీ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలు కానున్న విషయం మనకు తెలిసిందే ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే ఒక ఉబలాటం అందరిలో ఉంది అనే చెప్పాలి…ఇప్పటి వరకు అయితే మన టీమ్ చాలా బాగా ఆడింది కానీ ఇక ముందు జరిగే మ్యాచ్ మనకు చాలా కీలకంగా మారనుంది…